సాధారణంగా ఎదైనా తక్కువ ధరకు వస్తువు వస్తుందంటే..ముఖ్యంగా ఎలక్ట్రానిక్ గూడ్స్ లోని టీవి, ఫ్రిజ్, వాషింగ్ మెషన్ లాంటివాటికి ఆఫర్లు పెడితో జనాలు ఎగబడి తీసుకుంటారు.  ఈ మద్య డిజిటల్ మార్కెటింగ్ ఎక్కువ అయినప్పటి నుంచి చాలా వరకు ఆన్ లైన్ల ద్వారా కొనుగోలు చేస్తున్నారు.  
టెలివిజన్ మార్కెట్లో చైనా దిగ్గజం షియోమి ప్రకంపనలు రేపుతోంది. తక్కువ ధరకే అదిరే ఫీచర్లతో స్మార్ట్‌టీవీని లాంచ్ చేసి దిగ్గజాలను హడలెత్తిస్తోంది. ఇప్పటికే 55-inchతో Mi TV 4ని లాంచ్ చేసి టీవీ మార్కెట్లో సంచలనాన్ని రేకెత్తించింది. 

ఈ విషయాన్ని మరువక ముందే ఇంకా అత్యంత తక్కువ ధరలో స్మార్ట్‌టీవీని లాంచ్ చేసి మరో సవాల్ విసిరింది. Mi TV 4A సీరిస్‌లో 43 అంగుళాల టీవీ, 32 అంగుళాల టీవీలను లాంచ్ చేసింది. AI-powered PatchWall UIతో వచ్చిన ఈ స్మార్ట్‌టీవీ స్మార్ట్ ఫోన్లో మరొక సంచలనాన్ని సృష్టిస్తుందని కంపెనీ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.

వీటిని ఇండియాలో కంపెనీ Mi LED Smart TV 4Aగా పిలుస్తోంది. మరి ఈ టీవి వచ్చి రావడంతోనే ఆఫర్ల వెల్లువను అందిస్తోంది. ఇక 43 అంగుళాల Mi TV 4A ధరను కంపెనీ రూ.22999గా నిర్ణయించింది. అలాగే 32 అంగుళాల Mi TV 4A ధరను రూ. 13,999గా నిర్ణయించింది. కాగా ఈ రెండు వేరియంట్లు మార్చి 13న Mi.com, Flipkart, and Mi Home stores ద్వారా అమ్మకానికి రానున్నాయి. 

వారానికి రెండు రోజుల సేల్ నిర్వహిస్తామని ప్రామిస్ చేస్తోంది. మంగళవారం, శుక్రవారాల్లో మాత్రమే ఈ టీవీ అమ్మకానికి రానుంది. దీంతో ఈ ఆఫర్లు చూడగానే నెటిజన్లు ఆర్డర్లు చేయడానికి సిద్దంగా ఉన్నారు.  ఆఫర్లు రెండు రోజులు మాత్రమే కావడంతో టీవిలు దక్కించుకోవడానికి విపరీమైన కాంపిటీషన్ పెరిగిపోయింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: