ప్రపంచంలో టెక్నాలజీ విపరీతంగా పెరిగిపోతుంది.  ప్రతి విషయంలోనూ సగటు మనిషి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.  ఇక ఆర్థిక లావాదేవీలు కూడా ఉన్నచోటి నుంచి కొనసాగిస్తున్నారు.  అయితే ఆర్థిక లావాదేవీల్లో సోషల్ మాద్యమాలు కూడా ఎంటర్ అవుతున్నాయి.  ముఖ్యంగా పేటీఎం లాంటి సంస్థ  మరిన్ని సేవల్లోకి అడుగిడుతోంది.
Image result for paytm
ఇప్పటికే మొబైల్ రీచార్జ్, బస్ బుకింగ్ సేవలతో ఆరంభమైన ఈ సంస్థ ఆపై అన్ని రకాల డిజిటల్ చెల్లింపులు, ఈ కామర్స్, పేమెంట్స్ బ్యాంకు సేవలను ప్రారంభించిన విషయం విదితమే. తాజాగా ఈ సంస్థ తన పేమెంట్స్ బ్యాంకు ద్వారా కస్టమర్లకు బీమా, మ్యూచువల్ ఫండ్స్, మరెన్నో బ్యాంకింగ్ సేవలు అందించేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది.
Image result for paytm
ఫిజికల్ డెబిట్ కార్డు జారీతో ఆఫ్ లైన్ లావాదేవీలకూ వీలు కల్పించనుంది. ‘‘నిర్ణీత కాలంలోనే 850 పట్టణాల నుంచి ఆర్డర్లు వచ్చాయి. బ్యాంకింగ్ అవుట్ లెట్ల ఏర్పాటు ద్వారా డిపాజిట్, నగదు ఉపసంహరణ, నగదు బదిలీ సేవలను అందించనున్నాం’’ అంటూ పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఎండీ, సీఈవో రేణుసత్తి తెలిపారు.

ఇతర బ్యాంకులు, ఆర్థిక సంస్థల సహకారంతో వెల్త్ మేనేజ్ మెంట్, రుణాల జారీ, బీమా తదితర సేవలు అందించనున్నట్టు రేణుసత్తి తెలిపారు. అలాగే, పేటీఎం మనీ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలుకు కూడా వీలు కల్పించనున్నట్టు చెప్పారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: