నోకియా  బడ్జెట్‌ ధరలో కొత్త  ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఆండ్రాయిడ్ గో ఓఎస్ తో పనిచేసే నోకియా 1  ఆండ్రాయిడ్‌ గో ఎడిషన్‌ను మంగళవారం విడుదల చేసింది.  దీని ధర రూ.5,499గా నిర్ణయించింది. దేశవ్యాప్తంగా రేపటి నుంచి( బుధవారం) దీని విక్రయానికి అందుబాటులో ఉంటుదని కంపెనీ ప్రకటించింది.
Nokia 1 Android Go Smartphone Launched in India, Price Is Rs. 5,499   - Sakshi
గత నెలలో జరిగిన ప్రపంచ మొబైల్ కాంగ్రెస్ 2018 సదస్సులో ఈ ఫోన్ ను కంపెనీ ఆవిష్కరించిన విషయం గుర్తుండే ఉంటుంది. వార్మ్ రెడ్, డార్క్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. దీనికి అదనంగా అజూర్ గ్రే, యెల్లో, పింక్ కలర్స్ తో కూడిన మూడు కవర్లను ప్రత్యేకంగా రూ.450 ధరకు విక్రయించనుంది. యూజర్లు తరచూ కవర్ మార్చుకుంటూ కొత్త దనాన్ని ఆస్వాదించొచ్చు.


 దీంతోపాటు రిలయన్స్‌ జియో ద్వారా క్యాష్‌ బ్యాక్‌ఆఫర్‌  కూడా ఉంది. టెలికం సర్వీసు ప్రొవైడర్ రిలయన్స్ జియో రూ. 2,200,  క్యాష్‌ బ్యాక్‌ తో  ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ. 3,299 లభ్యం కానుందని హెచ్‌ఎండీ గ్లోబల్ వెల్లడించింది. అంతేకాదు 60జీబీ డేటా ఉచితం.  అలాగే కోటక్‌ 811 పొదుపు ఖాతా తెరవడంద్వారా  మొబైల్‌  12 నెలల ప్రమాదం  బీమా రెడ్‌బస్‌లో ఫస్ట్‌బుకింగ్‌పై 20 శాతం డిస్కౌంట్ ఉంటుందని సంస్థ ప్రకటనలో పేర్కొంది.


నోకియా 1 ఆండ్రాయిడ్‌ గో ఫీచర్లు :
4.5 అంగుళాల ఎఫ్ డబ్ల్యూవీజీఏ ఐపీఎస్ డిస్ ప్లే
480x854 పిక్సెల్‌ రిజల్యూషన్‌
1.1 గిగాహెర్జ్ క్వాడ్ కోర్ మీడియాటెక్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్‌ 8.1 ఓరియో
1జీబీ ర్యామ్
8జీబీ స్టోరేజీ
128 జీబీ దాకా విస్తరించుకునే అవకాశం
5 ఎంపీ వెనుక కెమెరా
2 ఎంపీ  సెల్ఫీ కెమెరా
2150 ఎంఏహెచ్‌ బ్యాటరీ


మరింత సమాచారం తెలుసుకోండి: