ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఆదాయపు పన్నును ఎగవేసిందన్న ఆరోపణలపై ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్ కు ఐటీ శాఖ షాకిచ్చింది.  చెన్నై, ముంబయిలలో సంస్థకు చెందిన బ్యాంకు ఖాతాలను ఐటీ అధికారులు స్తంభింపజేశారు.  కాగ్నిజెంట్ నుంచి 2016-17 సంవత్సరానికిగాను రూ. 2500 కోట్లకు పైగా టాక్స్ రావాల్సి వుందని ఆదాయ  పన్ను శాఖ అధికారులు వెల్లడించారు.

పన్ను చెల్లించకపోవడంతో ఇటీవల ఐటీ శాఖ కంపెనీకి పన్ను ఎగవేత నోటీసులు జారీ చేసింది. వీటికి సంస్థ స్పందించకపోవడంతో గత వారం ముంబయి, చెన్నైలలోని కాగ్నిజెంట్‌ బ్యాంకు ఖాతాలను నిలిపివేసినట్లు ఐటీశాఖ ఉన్నతాధికారి ఒకరు మీడియాకు తెలిపారు. అయితే కంపెనీ మాత్రం తాము అన్ని పన్నులు చెల్లించామని చెప్పింది.
Image result for కాగ్నిజెంట్ కు షాక్
ఖాతాల నిలుపుదలపై తాము మద్రాసు హైకోర్టును ఆశ్రయించినట్లు కాగ్నిజెంట్‌ పేర్కొంది.దీంతో చెన్నై, ముంబైలోని కాగ్నిజెంట్ బ్యాంకు ఖాతాలు స్తంభింపచేసి స్వాధీనపరుచుకున్నామని అధికారులు స్పష్టం చేశారు.
Image result for కాగ్నిజెంట్ కు షాక్
ఐటీ శాఖ చర్యలపై కాగ్నిజెంట్ చెన్నై హైకోర్టును ఆశ్రయించింది. తాము అన్ని బకాయిలను సక్రమంగా చెల్లించేశామని కంపెనీ తరపున ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఎఫెక్ట్ తమ ఉద్యోగులపై ఉండబోదని వారు స్పష్టం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: