Katamarayudu telugu movie review | Katamarayudu Movie Review Rating | Katamarayudu Review | Pawan Kalyan Katamarayudu

X
close save
crop image
x
TM
Sat, Dec 15, 2018 | Last Updated 10:08 am IST

Menu &Sections

Search

జియో మరో సంచలనం..ఐఎఫ్‌సీ నివేదికలో షాకింగ్ నిజాలు!

జియో మరో సంచలనం..ఐఎఫ్‌సీ నివేదికలో షాకింగ్ నిజాలు!
జియో మరో సంచలనం..ఐఎఫ్‌సీ నివేదికలో షాకింగ్ నిజాలు!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
భారత దేశంలో టెలీ కమ్యూనికేషన్ రంగంలో పెను సంచలనాలు సృష్టించింది జియో. ఉచిత ఆఫర్లు, చవక ధరలతో దేశవ్యాప్తంగా ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది.   అతి తక్కువ కాలంలో కోట్లాదిమంది ఖాతాదారులను సంపాదించుకున్న జియో ఇప్పటికీ సంచలనమే.  జియో రాకతో అప్పటి వరకు బెట్టు చేసిన ప్రత్యర్థి టెల్కోలు కూడా దిగి రాక తప్పలేదు. జియోను ఎదుర్కొని టెలికం రంగంలో నిలబడేందుకు ధరలను తగ్గించక తప్పలేదు. జియో రాకతో ప్రతి ఏటా వినియోగదారులకు రూ.64 వేల కోట్లు ఆదా అయిందని తెలిపింది. అంతేకాదు, తలససరి జీడీపీ కూడా పెరిగిందని వెల్లడించింది.   
reliance-jio-offers-data-entry-led-to-$10-billion-
ఎంట్రీ తోనే సంచలనాలు నమోదు చేసిన రిలయన్స్ జియో రాకతో దేశానికి ఎంతో మేలు జరిగిందని ఇనిస్టిట్యూట్‌ ఫర్‌ కాంపిటీటివ్‌నెస్‌(ఐఎఫ్‌సీ) పేర్కొంది. జియో రాకకు ముందు 1జీబీ డేటాకు అటూఇటుగా రూ.152 ఖర్చు చేయాల్సి వచ్చేది. జియో వచ్చిన తర్వాత 1జీబీ డేటా పది రూపాయలకు పడిపోయింది. దీంతో కోట్లాది మంది వినియోగదారులు లాభపడ్డారు.

reliance-jio-offers-data-entry-led-to-$10-billion-
ప్రతి ఒక్కరికీ ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులోకి వచ్చింది. జియో రాకతో టెలికం రంగంలో అనేక మార్పులు చోటు చేసుకున్నట్టు ఐఎఫ్‌సీ నివేదిక వెల్లడించింది. మార్కెట్లోకి జియో అడుగుపెట్టిన ఆరు నెలల్లోనే ప్రపంచంలోనే అత్యధిక మొబైల్ డేటాను ఉపయోగిస్తున్న దేశంగా భారత్ రికార్డులకెక్కింది.


reliance-jio-offers-data-entry-led-to-$10-billion-
5/ 5 - (1 votes)
Add To Favourite
About the author