రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బిఐ) మాజీ గవర్నర్ రఘురాం రాజన్‌కు మరో కీలక బాధ్యతలు దక్కే అవకాశం ఉందని సమాచారం. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్(బిఒఇ) తదుపరి గవర్నర్ రేసులో రాజన్ ముందజలో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో తరువాతి గవర్నర్ కోసం యుకె గవర్నమెంట్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొందరు ప్రముఖ ఆర్థికవేత్తల పేర్లను పరిశీలిస్తోందట. వీరిలో రఘురాం కూడా ఉన్నట్లు తెలిసింది.

ఇప్పటికే గవర్నర్ ఎంపిక ప్రక్రియ ప్రారంభించిన యుకె ఉన్నతాధికారులు మొత్తం ఆరుగురి పేర్లను తుది జాబితాకు ఎంపిక చేయగా, వీరిలో రాజన్ రేసులో ముందజలో ఉన్నట్లు తెలుస్తోంది. 2014లో ఐఎంఎఫ్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయనకు అవకాశం వచ్చినప్పటికీ, తిరస్కరించారు. ఆర్బీఐ గవర్నర్ గా 2016లో పదవీకాలాన్ని పూర్తి చేసుకున్నాక... అమెరికాలోని ఓ యూనివర్శిటీలో ఆయన ప్రొఫెసర్ గా బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు.

రాజన్ కు అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై సమగ్ర అవగాహన ఉండటంతో పాటు ఓ కేంద్ర బ్యాంక్‌కు సారథ్యం వహించిన అనుభవం తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని యుకె ప్రభుత్వం రాజన్ వైపు మొగ్గు చూపుతోందని సమాచారం. 


మరింత సమాచారం తెలుసుకోండి: