ఈ మద్య టెక్నాలజీ విపరీతంగా డెవలప్ మెంట్ అవుతుంది..ఎంత కష్టతరమైన పనులు కూడా చిటికెలో అవుతున్నాయి. ముఖ్యంగా కమ్యూనికేషన్, మనీ ట్రాన్ జెక్షన్ కొత్త కొత్త ఫీచర్లతో బాగా అభివృద్ది చెందుతుంది. ఒకప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థలో లావాదేవీలు చాలా కష్టతరంగా ఉండేవి..కానీ ఆన్ లైన్, యాప్స్ వచ్చిన తర్వాత ఈజీ పేమెంట్ సిస్టం చాలా ఈజీ అయ్యింది. ఇక పేటీఎం వచ్చినప్పటి నుంచి లావాదేవీలు మరింత సౌలభ్యంగా మారాయి. తాజాగా పేటీఎం మరో కొత్త పేమెంట్‌  మోడ్‌ను లాంచ్‌ చేసింది.
Image result for paytm
ట్యాప్‌ కార్డు పేరుతో భారత్‌లో మొదటి ఆఫ్‌లైన్‌ పేమెంట్స్‌ సొల్యుషన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.  కార్డు ద్వారా నియర్-ఫీల్డ్ కమ్యూనికేషన్(NFC)ని వాడుతూ నగదును కంప్యూటర్‌ ఆథరైజ్డ్‌ పాయింట్‌ ఆఫ్‌ టర్మినల్స్‌కు బదిలీ చేయవచ్చు. నాన్‌-ఇంటర్నెట్‌ యూజర్లను టార్గెట్‌గా చేసుకుని పేటీఎం కార్డును పేటీఎం లాంచ్‌ చేసింది.పేటీఎం ట్యాప్‌ కార్డు ద్వారా NFCని వాడుతూ సురక్షితంగా, తేలికగా డిజిటల్‌ పేమెంట్లను చేసుకోవచ్చు. సెకన్ల వ్యవధిలోనే ఈ పేమెంట్లను పూర్తి చేయవచ్చని కంపెనీ తెలిపింది.
paytm
కాకపోతే పేమెంట్లు జరుపడానికి యూజర్లు ట్యాప్‌ కార్డుపై ఉన్న క్యూ ఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి పేటీఎం అకౌంట్లలోకి మనీని యాడ్‌ చేయాల్సి ఉంటుంది. ట్యాప్‌ కార్డును వాడుతూ వెంటవెంటనే డిజిటల్‌ పేమెంట్లు జరుపడం కోసం పేటీఎం ప్రస్తుతం ఈవెంట్లు, ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూట్లు, కార్పొరేట్లతో భాగస్వామ్యం ఏర్పరచుకుంటోంది.
Related image
పేమెంట్‌ను జరుపడానికి మెర్చంట్‌ టర్మినల్‌ దగ్గర కస్టమర్‌ కార్డును ట్యాప్‌ చేయాల్సి ఉంటుంది. ఫోన్లను పట్టుకెళ్లకుండానే ఈ లావాదేవీలు జరుపుకోవచ్చు. కొందరు ఆన్‌లైన్‌ పేమెంట్లు జరుపడానికి జంకుతున్నారని పేటీఎం సీఓఓ కిరణ్‌ వాసి రెడ్డి తెలిపారు. వారి కోసం పేటీఎం ట్యాప్‌ కార్డును తాము ఆఫర్‌ చేస్తున్నట్టు తెలిపారు. ఇది తమ యూజర్ల అవసరాల కోసం తీసుకొచ్చామని… ఎప్పడికప్పుడు కొత్త విష్కరణలతో యూజర్ల ముందుకు వస్తున్నట్టు చెప్పారు.



మరింత సమాచారం తెలుసుకోండి: