ఈ మద్య టెక్నాలజీ బాగా పెరిగిపోయింది..దాంతో మనిషికి ఎన్నో సౌకర్యాలు తన వద్దకే వచ్చి చేరుతున్నాయి.  టెలీకాం రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చిన విషయం తెలిసిందే.  అంతే కాదు బ్యాంకింగ్ రంగంలో కూడా ఎన్నో అధునాతన మార్పులు చేర్పులు వచ్చాయి.  ఉన్న చోట నుంచి మన అకౌంట్ల ద్వారా కోట్లు ట్రాన్ జెక్షన్ చేసుకునే సౌకర్యం వచ్చింది. అంతే కాదు సామాన్యుడి నుంచి కోటీశ్వరుడి వరకు ఏటీఎం కూడా అందుబాటులోకి వచ్చాయి.  స్మార్ట్‌ఫోన్ చేతిలో ఉంటే కావాల్సినవన్నీ మీ నట్టింట్లోకే నడిచొస్తాయి.. డబ్బు లావాదేవీలు కూడా ఎంచక్కా చేతివేళ్లపైనే చేసేయొచ్చు.

అయితే, నగదు తీసుకోవాలంటే బ్యాంకునో, ఏటీఎంనో వెదుక్కుంటూ వెళ్లాల్సిందే! ఇటీవల ఏటీఎంలలోనూ నగదు లభ్యత సరిగా లేకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. తాజాగా ఈ ఇబ్బందులు కొంత వరకైనా దూరం చేసుకోవచ్చు..అవును ఇప్పుడు ఇంటివద్దకే నగదును తీసుకొచ్చే ఆలోచనతో సహకార బ్యాంకు అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా పది మొబైల్ ఏటీఎంలను తీసుకొస్తున్నారు.

ఇందులో ఒకదానిని కరీంనగర్ జిల్లాలో తిప్పుతున్నారు. దీనిని రోజుకో గ్రామంలో నిలుపుతారు. ఇందులో రూ.2 లక్షల వరకు నగదుని నిల్వ ఉంటుంది. అన్ని బ్యాంకుల ఖాతాదారులు ఈ ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. రెండు మూడు రోజుల్లో ఈ ఏటీఎంలను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ ప్రారంభిస్తారు.



మరింత సమాచారం తెలుసుకోండి: