మల్టీ నేషనల్‌ కంపెనీలను దెబ్బతీస్తున్న యోగా గురువు రామ్ దేవ్ బాబాకు చెందిన పతంజలి సంస్థ నుంచి ఇక జీన్స్ ప్యాంట్లు రానున్నాయి. ఇప్పటికే పతంజలి మ్యాగీ.. పతంజలి ఫేస్‌క్రీం.. పతంజలి హనీ.. ఇలా ఆహర, ఆరోగ్య, గృహోపకరణాల రంగాల్లో మార్కెట్లోకి అడుగుపెట్టి అనతికాలంలోనే భారీ మొత్తంలో అమ్మకాలు జరుపుతున్న పతంజలి.. తాజాగా వస్త్రవ్యాపారంలోకి కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. స్వదేశీ సంప్రదాయాలకు అనుగుణంగా తమ సంస్థ నుంచి దుస్తులను విక్రయించనున్న విషయాన్ని పతంజలి ఆయుర్వేద్ సంస్థ ప్రకటించిన విషయం తెలిసిందే.
Image result for పతాంజలి జీన్స్
తమ సంస్థ తయారు చేసే దుస్తులను ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి తీసుకు రానున్నట్టు సంస్థ ఎండీ, సహ వ్యవస్థాపకుడు ఆచార్య బాలకృష్ణ తెలిపారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, పరిధాన్ బ్రాండ్ కింద తమ సంస్థ దుస్తులను విక్రయిస్తామని, వీటి విక్రయాల కోసం దేశ వ్యాప్తంగా మెట్రో, ఇతర నగరాల్లో 100 స్టోర్లను ప్రారంభించనున్నట్టు చెప్పారు.  తొలి దశలో భాగంగా.. దేశవ్యాప్తంగా 250 రిటేల్‌ అవుట్‌లెట్ల ద్వారా ఈ దుస్తులను అమ్మునున్నారు. ఏడాదికి రూ.5వేల కోట్ల విలువైన అమ్మకాలే లక్ష్యంగా దుస్తులను తయారుచేసినట్లు తిజారావాలా చెప్పారు.
Image result for పతాంజలి జీన్స్
బిగ్‌బజార్‌ లాంటి స్టోర్లలోనూ ఈ దుస్తులను అందుబాటులో ఉంచనున్నారట.కాగా, ‘పరిధాన్’ బ్రాండ్ కింద  మార్కెట్లోకి రాబోయే దుస్తుల్లో.. పిల్లల దుస్తులతో పాటు యోగా దుస్తులు, దుప్పట్లు, స్పోర్ట్స్ వేర్, టోపీలు, టవల్స్, బూట్లు.. విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మన దేశ వాతావరణ పరిస్థితులు, సంప్రదాయాలకు అనుగుణంగా స్వదేశీ జీన్స్ ను రూపొందిస్తున్నామని యోగా గురువు రాం దేవ్ బాబా ఇటీవల తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: