గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చిత పరిస్థితులు, ముడి చమురు ధరల్లో మళ్లీ భారీ పెరుగుదల, రూపాయి మారకం విలువ పతనం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఆరు వారాల కనీస స్థాయిలో ముగిసాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 272.93 పాయింట్ల నష్టంతో 35,217.11 వద్ద ముగిసింది. నిఫ్టీ 97.75 పాయింట్ల నష్టంతో 10671.40 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ సంవత్సరన్నర కాల కనీస స్థాయి చేరుకోవడంతో మార్కెట్ వర్గాలను ఆందోళనకు గురిచేస్తున్నది.

Image result for global share market

మరో వైపు విదేశీ పెట్టుబడులు తరలి పోవడంతో వర్థమాన మార్కెట్లలో రిస్క్‌లు పెరిగిపోయాయని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.  ఎన్‌పీఏల పరిస్థితి మరింత విషమించనుందని ఆర్బీఐ ఆ నివేదికలో పేర్కొనడంతో పీఎన్‌బీ, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్‌బీఐ, సిండికేట్ బ్యాంక్, ఓరియంటల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ తదితర ప్రభుత్వ రంగ బ్యాంకుల షేర్లు భారీగా నష్టపోయాయి.

Image result for global share market

కాగా, గురువారం నాడు జూన్ నెల డెరివేటివ్స్ కాంట్రాక్టు ముగుస్తుండడంతో కూడా ట్రేడర్లు అప్రమత్త ధోరణిని ప్రదర్శించారు. ఎఫ్‌ఐఐలు కేవలం రూ. 67.44 కోట్ల కొనుగోళ్లు జరుపగా, డీఐఐలు రూ. 84.31 కోట్ల కొనుగోళ్లు జరిపారు. బీఎస్‌ఈలో కేవలం 496 షేర్లు మాత్రమే లాభ పడగా, 2193 షేర్లు నష్టాలతో ముగిసాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: