ఈ రోజు(మంగ‌ళ‌వారం) మార్కెట్లు లాభాల‌తో ముగిశాయి. ట్రేడింగ్ ప్రారంభ‌మైన మొద‌టి గంట సేపు ఊగిస‌లాడిన దేశీయ మార్కెట్లు త‌ర్వాత జోరందుకున్నాయి. కొన్ని షేర్ల కొనుగోళ్ల‌కు మ‌దుప‌ర్లు మొగ్గుచూప‌డంతో మార్కెట్లు లాభాల దిశ‌గా క‌దిలాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 114 పాయింట్లు పెరిగి 35,379కి చేరింది. నిఫ్టీ 43 పాయింట్లు లాభపడి 10,700 వద్ద స్థిరపడింది.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టైమ్ టెక్నోప్లాస్ట్ (8.93%), జస్ట్ డయల్ (7.23%), ఫోర్టిస్ హెల్త్ కేర్ (6.85%), టాటా గ్లోబల్ బెవరేజెస్ (6.38%), అబాన్ ఆఫ్ షోర్ (5.92%).

టాప్ లూజర్స్:
ఐడీబీఐ బ్యాంక్ (-6.25%), అవంతి ఫీడ్స్ (-5.12%), వక్రాంగీ (-4.96%), క్వాలిటీ (-4.82%), ఫ్యూచర్ లైఫ్ స్టైల్ ఫ్యాషన్స్ (-3.92%).  
ఎన్‌ఎస్‌ఈలో సిప్లా, బజాజ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మారుతి, లుపిన్, సన్‌ఫార్మా షేర్లు లాభపడగా.. వేదాంత లిమిటెడ్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రాటెక్‌ సిమెంట్‌ షేర్లు నష్టపోయాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: