అంతర్జాతీయ మార్కెట్లు నిస్తేజంగా ఉన్నా మన మార్కెట్లు ఆకర్షణీయ లాభాలతో ముగిశాయి. ఐటీ మినహా అన్ని సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. ప్రభుత్వ బ్యాంకుల అండతో ఇవాళ నిఫ్టి భారీ లాభాలు గడించింది. ఉదయం నుంచి నిస్తేజంగా ఉన్నా... పై స్థాయిలో నిఫ్టికి బ్యాంకులు అండగా నిలిచాయి.  దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. ఈ వారంలో ఆర్బీఐ పాలసీ సమావేశం ఉన్న నేపథ్యంలో, ఇన్వెస్టర్లు ఆశాభావంతో ట్రేడింగ్ చేశారు. దీంతో, ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 158 పాయింట్లు లాభపడి 37,494కు చేరుకుంది.

నిఫ్టీ 41 పాయింట్లు పెరిగి 11,320 వద్ద స్థిరపడింది. బ్యాంక్ చరిత్ర‌లో తొలిసారి న‌ష్టాలు ప్ర‌క‌టించిన ఐసీఐసీఐ బ్యాంక్  రెండున్న‌ర శాతం లాభంతో రూ.300 వ‌ద్ద ట్రేడ‌వుతోంది. ఇక బ్యాంక్ ఖాతాలు క్లీన్ అయిన‌ట్లేన‌ని ఇన్వెస్ట‌ర్లు భావిస్తున్నారు.నిఫ్టి ప్ర‌ధాన షేర్ల‌లో హెచ్‌పీసీఎల్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, వేదాంత‌, ఓఎన్‌జీసీ లాభాల్లో ముందు ఉన్నాయి. ఇక న‌ష్టాల్లోటాప్‌లో ఉన్న కంపెనీల్లో  కొట‌క్ బ్యాంక్‌, ఇన్ఫోసిస్‌, విప్రో, ఐష‌ర్ మోటార్స్‌, బ‌జాజ్ ఫైనాన్స్ ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బ‌రోడా, పీఎన్‌బీ కూడా ఆక‌ర్ష‌ణీయ లాభాల‌తో ట్రేడ‌వుతున్నాయి.


ఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్స్ మాకో రైల్ అండ్ ఇంజినీరింగ్ లిమిటెడ్ (13.02%), అదానీ పవర్ (10.88%), నవకార్ కార్పొరేషన్ (10.81%), గతి లిమిటెడ్ (10.13%), బ్యాంక్ ఆఫ్ బరోడా (9.92%).
టాప్ లూజర్స్:
ఇన్ఫో ఎడ్జ్ (-3.93%), జుబిలెంట్ లైఫ్ సైన్సెస్ (-3.92%), కేఈసీ ఇంటర్నేషనల్ (-3.48%), మ్యాక్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (-2.93%), రిలయన్స్ ఇన్ఫ్రా (-2.78%).   


మరింత సమాచారం తెలుసుకోండి: