భారతీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు దూసుకుపోయాయి.  దేశీయ స్టాక్‌మార్కెట్లు జోరు అప్రతిహతంగా కొనసాగుతోంది. కీలక సూచీలు మరోసారి ఆల్-టైమ్ గరిష్టాలను నమోదు చేసి దూసుకుపోతున్నాయి. ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల ప్రోత్సాహంతో దేశీ మార్కెట్లు ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల డబుల్‌ సెంచరీని సాధించింది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ ఏకంగా 442 పాయింట్లు పెరిగి 38,694కు ఎగబాకింది.
Markets At Record Highs: Sensex Climbs 339 Points - Sakshi
నిఫ్టీ 135 పాయింట్లు లాభపడి 11,691కి చేరుకుంది. తద్వారా సెన్సెక్స్, నిఫ్టీలు జీవితకాల గరిష్ట స్థాయులను తాకాయి.  దాదాపు అన్ని రంగాలూ లాభపడుతుండగా .. మెటల్‌, బ్యాంక్‌ నిఫ్టీ, ఆటో, ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, రియల్టీ టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి. 
Sensex  Raises Over 440 Points, Nifty Hits 11,700 First time - Sakshi
హిందాల్కో, యస్‌బ్యాంక్‌, టాటా స్టీల్‌, గ్రాసిమ్‌, ఐవోసీ, ఎస్‌బీఐ, హెచ్‌పీసీఎల్‌, పవర్‌గ్రిడ్, బీపీసీఎల్‌, టెక్‌ మహీంద్రా  లాభాలతో కొనసాగుతున్నాయి. మరోపక్క ఎల్‌ఐసీ హౌసింగ్‌, జేపీ, డీష్‌ టీవీ, జెట్‌ ఎయిర్‌వేస్‌, స్టార్, అపోలో హాస్పిటల్స్‌, ఆర్‌కామ్‌, ఐడీఎఫ్‌సీ, ఆర్‌పవర్‌ నష్టపోతున్నాయి.


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అదానీ ట్రాన్స్ మిషన్ లిమిటెడ్ (19.98%), షాపర్స్ స్టాప్ (12.44%), మోయిల్ లిమిటెడ్ (9.83%), జిందాల్ సా లిమిటెడ్ (8.14%), రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (7.27%).


టాప్ లూజర్స్:
జైప్రకాశ్ అసోసియేట్స్ (-10.05%), ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ (-7.67%), ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ (-6.37%), జమ్ము అండ్ కశ్మీర్ బ్యాంక్ (-5.25%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ (-4.99%).  



మరింత సమాచారం తెలుసుకోండి: