అత్యంత కనిష్ట స్థాయిల్లోకి పడిపోతూ.. రోజురోజుకు క్షీణిస్తున్న రూపాయి మారకం ఒక్కసారిగా పెద్ద ఎత్తున రికవరీ అయింది. రూపాయి భారీగా కోలుకోవడం, స్టాక్‌ మార్కెట్లను హైజంప్‌ చేయించింది. రూపాయి దెబ్బకు గత రెండు రోజుల నుంచి భారీగా పతనమవుతున్న సెన్సెక్స్‌ ఒక్కసారిగా త్రిపుల్‌ సెంచరీని బీట్‌ చేసింది.   ఎఫ్ఎంసీజీ, మెటల్, ఫార్మా, ఇన్ఫ్రా సూచీలు మార్కెట్లను లాభాల బాట పట్టించాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 305 పాయింట్లు ఎగబాకి 37,718కి చేరుకుంది. 


నిఫ్టీ 82 పాయింట్లు లాభపడి 11,370 వద్ద స్థిరపడింది.   హిందాల్కో, టాటా మోటార్స్‌. ఐసీఐసీఐ , సన్‌ ఫార్మ టాప్‌ లూజర్స్‌గా ఉండగా,  వేదాంత, హెచ్‌యూఎల్‌,  బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నష్టపోతున్నాయి.కోల్‌ ఇండియా,  పవర్‌గ్రిడ్‌, ఐటీసీ, ఎం అండ్‌ ఎండ్‌, విప్రో, అదానీ స్వల్పంగా లాభపడుతున్నాయి.  మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి మరోసారి చారిత్రక కనిష్టాన్ని నమోదు చేసింది. డాలరు మారకంలో  42 పైసలు కోల్పోయిన రూపాయి 72.88 వద్ద ఆల్‌ టైం  కనిష్టానికి చేరింది. 


నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ (6.68%), ఇంటలెక్ట్ డిజైన్ ఎరీనా లిమిటెడ్ (6.65%), ఏబీబీ ఇండియా (5.60%), అలెంబిక్ ఫార్మాస్యూటికల్స్ (5.18%), స్వాన్ ఎనర్జీ (4.78%).  టాప్ లూజర్స్:గ్రాన్యూల్స్ ఇండియా (-5.73%), బ్యాంక్ ఆఫ్ బరోడా (-5.12%), రాడికో ఖైతాన్ లిమిటెడ్ (-4.85%), రెప్కో హోం ఫైనాన్స్ (-4.69%), వెల్స్ పన్ ఇండియా (-4.44%). 


మరింత సమాచారం తెలుసుకోండి: