ప్రపంచ మార్కెట్ల సానుకూలతల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. తద్వారా రెండు రోజుల వరుస నష్టాలకు చెక్‌ పడింది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ లాభాల సెంచరీ సాధించింది.    అంతర్జాతీయంగా ఎలాంటి సానుకూలతలు లేకపోవడం, అమెరికాచైనాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 85 పాయింట్లు పెరిగి 37,376కు చేరింది. నిఫ్టీ సైతం 28 పాయింట్లు బలపడి 11,300 పైన 11,306 వద్ద ట్రేడవుతోంది. ఎన్‌ఎస్‌ఈలో ఫార్మా, మెటల్‌ రంగాలు 1.3 శాతం స్థాయిలో పుంజుకోగా.. ఆటో 0.5 శాతం బలపడింది.   


ట్రెండింగ్‌ ప్రారంభంలో కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, యస్‌ బ్యాంక్‌, టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్స్‌ లాభాలు పండించగా...  హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నష్టాలు గడిస్తున్నాయి.  కన్య్జూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ స్టాకులు బాగా ప్రభావితమయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 169 పాయింట్లు కోల్పోయి 37,121కు పడిపోయింది. ఇంట్రాడే ట్రేడింగ్ లో సెన్సెక్స్ 37,531 పాయింట్ల గరిష్ఠ స్థాయిని... 37,062 పాయింట్ల కనిష్ఠ స్థాయిని టచ్ చేసింది. మరోవైపు నిఫ్టీ 44 పాయింట్లు నష్టపోయి 11,234కు దిగజారింది. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:డీసీఎం శ్రీరామ్ (11.76%), యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (4.54%), హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ (4.49%), మోన్శాంటో ఇండియా (3.92%), ఏఐఏ ఇంజినీరింగ్ (3.90%).టాప్ లూజర్స్:రిలయన్స్ నిప్పాన్ లైఫ్ అస్సెట్ మేనేజ్ మెంట్ (-11.28%), రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (-9.41%), రిలయన్స్ క్యాపిటల్ (-7.87%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (-7.74%), విజయా బ్యాంక్ (-6.56%).  

మరింత సమాచారం తెలుసుకోండి: