డాలర్‌తో రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోతోంది. బుధవారం తొలిసారి రూ.73 దాటింది. మార్కెట్ మొదలైన సమయానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 73.41. ఇది జీవనకాల గరిష్ట విలువ.  డాలర్‌తో రూపాయి మారకం విలువ 26 పైసలు పతనం అయింది. విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణకు తోడు కరెన్సీ మార్కెట్‌లో డాలర్ బలపడడంతో రూపాయి మారకం విలువ సోమవారం రూ.72.91 వద్ద ముగిసింది. అమెరికా ట్రెజరీ రాబడులు 3 శాతానికి పెరగడంతో పాటు డాలర్ బలపడిందని కరెన్సీ మార్కెట్ విశ్లేషకులు అభిపడ్డారు.
sensex plunges 551 pts, hits 3-month low; nifty ends at 10,851
ఈ నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఈరోజు కుప్పకూలాయి. సెన్సెక్స్ 550 పాయింట్లు పతనమై 35,975కి పడిపోయింది. నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 10,858కి జారుకుంది. బుధవారం నాటి ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఉదయం నుంచే నష్టాలతో ప్రారంభమైన సూచీలు ఏ దశలోనూ కోలుకునే పరిస్థితి కనిపించకపోగా..మరింత నష్టాల్లోకి జారుకున్నాయి. రూపాయి పతనం, అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరగడం, ఇటలీ సంక్షోభం, ఇన్‌ఫ్రా రంగం కుదేలవడం, అంతర్జాతీయ మార్కెట్లు బలహీనపడటం దేశీయ మార్కెట్లు పతనమవడానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. 


బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్ పోర్టేషన్ నెట్ వర్క్స్ (19.29%), ఇన్ఫీబీమ్ అవెన్యూస్ (14.82%), కాక్స్ అండ్ కింగ్స్ (12.30%), నేషనల్ అల్యూమినియం కంపెనీ (11.52%), ఇండియాబుల్స్ (9.99%).


టాప్ లూజర్స్:
ఐఐఎఫ్ఎల్ హోల్డింగ్స్ (-6.98%), ఐషర్ మోటార్స్ (-6.71%), మహీంద్రా అండ్ మహీంద్రా (-6.66%), ముత్తూట్ ఫైనాన్స్ (-5.77%), బాటా ఇండియా (-5.77%).


మరింత సమాచారం తెలుసుకోండి: