దేశీయ స్టాక్‌మార్కెట్లు బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి.   అనంతరం లాభాల్లోకి మళ్లాయి.   ఐటీ, ఫార్మా, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల అండతో లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 551 పాయింట్ల లాభంతో 34,442కు పెరిగింది. నిఫ్టీ 188 పాయింట్లు పుంజుకుని 10,387కు చేరుకుంది. ఐటీ, బ్యాంకు షేర్లు లాభపడుతున్నాయి. అమెరికా రెగ్యులేటరీ  అబ్జర్వేషన్ల వార్తలతో డా.రెడ్డీస్‌ భారీ నష్టాలతో టాప్‌  లూజర్‌గా ఉంది.  ఇంకా  కోల్‌ ఇండియా, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌,  టాటా స్టీల్‌, అదానీ పోర్ట్స్‌, పవర్‌గ్రిడ్‌  6శాతానికి పైగా నష్టపోతున్నాయి. 


టాప్ గెయినర్స్:టోరెంట్ పవర్ (12.95), కమ్మిన్స్ ఇండియా (10.97), ఐఆర్బీ ఇన్ఫ్రా (10.46), జీహెచ్సీఎల్ (9.94), పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ (9.75).  

టాప్ లూజర్స్:ఏజీస్ లాజిస్టిక్స్ (5.89), జెట్ ఎయిర్ వేస్ (5.71), నవీన్ ఫ్లోరిన్ ఇంటర్నేషనల్ (5.23), ఇండియన్ ఎనర్జీ ఎక్స్ ఛేంజ్ లిమిటెడ్ (4.97), మన్ పసంద్ బెవరేజెస్ (4.97).   

మరింత సమాచారం తెలుసుకోండి: