స్టాక్‌ మార్కెట్లో లాభాల జోరు కొనసాగుతోంది.  దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా అయిదవ సెషన్లో  లాభాలతో ముగిశాయి. ఆరంభంనుంచి లాభాల జోరు సాగించిన సూచీలు మధ్యలో కొంత తడబడినా చివరకు స్థిరంగా ముగిసాయి.  సెన్సెక్స్‌ 307 పాయింట్లు ఎగిసి 36,270వద్ద, నిప్టీ 83 పాయింట్లు లాభంతో  10,888 వద్ద  క్లోజ్‌ అయ్యాయి.  ఇంట్రా డేలో నిఫ్టీ 10990 స్థాయిని టచ్‌ చేయడం గమనార్హం.

దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే ముగిశాయి.ఐదు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడటం, ఆర్బీఐకి కొత్త గవర్నర్ ను నియమించడంతో మార్కెట్లలో పాజిటివ్ ట్రెండ్ కొనసాగుతోంది.  బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 36 వేల పాయింట్లు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 10,850 పాయింట్లపైకి ఎగబాకాయి. వాహన, లోహ, ఆర్థిక, వినియోగ రంగ షేర్లు లాభపడ్డాయి. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్లు మళ్లీ పుంజుకోవడం, ముడి చమురు ధరలు నిలకడగా ఉండటం  కలసివచ్చింది.

టాప్ గెయినర్స్:బీఈఎంఎల్ (8.04%), కాక్స్ అండ్ కింగ్స్ (7.20%), హిందుస్థాన్ కాపర్ (6.02%), అవంతి ఫీడ్స్ (5.97%), ఎంఎంటీసీ (5.78%).

టాప్ లూజర్స్:ప్రిస్టేజ్ ఎస్టేట్స్ (-6.06%), క్వాలిటీ (-4.99%), వక్రాంగీ (-4.96%), రిలయన్స్ నేవల్ అండ్ ఇంజినీరింగ్ (-4.88%), జెట్ ఎయిర్ వేస్ (-3.79%).   

మరింత సమాచారం తెలుసుకోండి: