ప్రపంచంలో రోజు రోజుకీ టెక్నాలజీ బాగా పెరిగిపోతుంది. ముఖ్యంగా కమ్యూనికేషన్, టెలివిజన్ రంగాల్లో ఎన్నో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయి.  ఈ మద్య స్మార్ట్ టీవిలు ప్రజలకు ఎంతో సౌకర్యంగా మారింది. టెక్నాలజీలో ఎన్నో మార్పులు తీసుకువస్తున్న ఎల్ జీ సంస్థ మరో అద్భుతాన్ని ఆవిష్కరించింది.    ఇటీవలే ఫోల్డింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌ మార్కెట్‌కు వచ్చింది. ఇప్పుడు ఏకంగా ఫోల్డింగ్‌ టీవీ రానుంది. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ వస్తువుల ఉత్పత్తి సంస్థ ఎల్‌జీ 65 అంగుళాల(165 సెంటీమీటర్)  4కే సిగ్నేచర్‌ ఓఎల్‌డీ టీవీని రూపొందించింది.


నెవడాలోని లాస్‌వెగాస్‌లో ఈనెల 8వ తేదీ నుంచి జరుగుతున్న వినియోగదారుల ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తుల ప్రదర్శనలో కంపెనీ దీన్ని ఉంచింది. 2019, జనవరి 8నుంచి 11వరకు లాస్ వెగాస్‌లో జరుగుతున్న కన్జూమర్ ఎలక్ట్రానిక్స్ షో (సీఈఎస్)లో భాగంగా ఈ టీవీని ఎల్‌జీ పరిచయం చేసింది. ఈ ఏడాదిలోనే  ఈటీవీ కొనుగోలుకు అందుబాటులోకి రానుంది. 


ఈ టీవీ కోసం 65 అంగుళాల తెరను ఎల్‌జీ రూపొందించింది.  గూగుల్ అసిస్టెంట్, అమెజాన్ అలెక్సా వర్చువల్ అసిస్టెంట్, యాపిల్‌ ఎయిర్‌ ప్లే సపోర్టు తోపాటు  100 వాల్ట్స్‌ డాల్బీ అట్మాస్‌ స్పీకర్‌ ఈ టీవీ ప్రత్యేకత అని సీనియర్ డైరెక్టర్  టిమ్ అలెస్సీ చెప్పారు. దశాబ్దాల క్రితంనుంచి ఎదురుచూస్తున్న ఈ టెక్నాలజీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చిందని  మార్కెటింగ్ ఎల్‌జీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్  డేవిడ్ వండర్ వాల్ ఓఎల్‌ఈడీ ఆర్ టీవీ పరిచయం సందర్బంగా చెప్పారు. కాకపోతే ఈ టీవీ ధరను  మాత్రం కంపెనీ గోప్యంగా ఉంచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: