అమెరికాలోని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్)లో చీఫ్ ఎకనమిస్ట్ పదవిని తొలిసారి ఓ మహిళ అలంకరించారు. భారత్ లోని తమిళనాడుకు చెందిన గీతా గోపీనాథ్ ఐఎంఎఫ్ లో చీఫ్ ఎకనమిస్ట్ పదవిని చేపట్టి రికార్డు సృష్టించారు. హార్వర్డ్‌ యూనివర్సిటీలో గీత ఆర్థిక శాస్త్రం ప్రొఫెసర్‌ గా పనిచేస్తున్నారు ఐఎంఎఫ్‌లో అత్యున్నత పదవి పొందిన తొలి మహిళగా గీత ఈ ఘనతను సాధించారు.  ఐఎంఎఫ్‌ పరిశోధన విభాగం డైరెక్టర్‌గా పనిచేసిన మౌరీ ఆస్టెఫెల్డ్‌  పదవీ విరమణ అనంతరం ఈ పదవిలో నియమితులయ్యారు.


 ఐఎంఎఫ్‌ 11వ చీఫ్‌ ఎకనమిస్ట్‌‌గా గీతా గోపీనాథ్‌ బాధ్యతలు నిర్వహించనున్నారు. తనకు ఈ పదవి దక్కడం చాలా అరుదైన గౌరవంగా భావిస్తున్నానని గీతా గోపీనాథ్ తెలిపారు.  ప్రస్తుతం ప్రపంచీకరణ నుంచి వెనక్కి తగ్గడం, సుంకాలు పెంపు పెద్ద సవాళ్లుగా మారాయని, బహుళజాతి సంస్థలకు ఇబ్బందులు పెరిగాయని గీత వెల్లడించారు. ముందు ముందు ప్రపంచ ఆర్ధిక విధానాలు సరళీకృతంగా జరగడానికి తన వంతు  కృషిని చేస్తానని గీతా గోపీనాథ్ అంటున్నారు. 

gita gopinath joins imf

విద్యా ప్రావీణ్యం, నాయకత్వ బాధ్యతల్లో మంచి ట్రాక్‌ రికార్డు, విస్తృతమైన అంతర్జాతీయ అనుభవవం వంటివి గీతా గోపీనాథ్ సొంతమని కితాబిచ్చారు. ఇక గీతా గోపీనాథ్ విషయానికి వస్తే..భారత్‌లో పుట్టి పెరిగిన గీతా గోపీనాథ్‌కు అమెరికా పౌరసత్వం ఉంది. కోల్‌కతాలో పుట్టిన ఈమె మైసూరులో పెరిగింది. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఏ డిగ్రీ పొందారు. ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ ఎకనమిక్స్‌, యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ నుంచి ఎంఏ డిగ్రీలు పూర్తి చేశారు. 2001లో ప్రిన్స్‌స్టన్‌ యూనివర్సిటీలో ఎకానమిక్స్‌లో పీహెచ్‌డీ చేశారు. అదే ఏడాది యూనివర్సిటీ ఆఫ్‌ చికాగాలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరారు. 2005లో హార్వర్డ్‌కు వెళ్లారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: