దేశీయ స్టాక్‌మార్కెట్లు స్వల్ప లాభాలతో ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి.  ​కానీ వెంటనే నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్‌ 19 పాయింట్లు, నిఫ్టీ 2 పాయింట్లు క్షీణించి కొనసాగుతున్నాయి. స్టాక్‌ మార్కెట్‌ నష్టాలు వరుసగా ఏడో ట్రేడింగ్‌ సెషన్‌లోనూ కొనసాగాయి. అంతర్జాతీయ సంకేతాలు, కంపెనీల క్యూ3 ఆర్థిక ఫలితాలు అంతంతమాత్రంగానే ఉండటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు కొనసాగడం ప్రతికూల ప్రభావం చూపించాయి. నేటి మార్కెట్ ఉదయం నుంచి తీవ్ర ఒడిదుడుకులకు గురైంది. అమ్మకాల ఒత్తిడితో మార్కెట్లు ఏ దశలోనే కోలుకోలేక పోయాయి.

Sensex Closes Lower For Seventh Day - Sakshi

ముఖ్యంగా ఆటోమొబైల్, ఐటీ, ఫార్మా షేర్లు కుదేలయ్యాయి.  ఇంట్రాడేలో 365 పాయింట్ల వరకూ నష్టపోయిన సెన్సెక్స్‌ చివరకు 67 పాయింట్ల నష్టంతో 35,809 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 22 పాయింట్లు నష్టపోయి 10,724 పాయింట్ల వద్ద ముగిశాయి. గత  ఏడు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 1,166 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్ లో టాటా మోటార్స్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, వేదాంత లిమిటెడ్ తదితర కంపెనీలు లాభపడ్డాయి.

Stockmarkets Opens With Flat  - Sakshi

యస్ బ్యాంక్, టీసీఎస్, ఐటీసీ, ఐసీఐసీఐ, హిందుస్థాన్ యూనీలీవర్ తదితర కంపెనీలు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ లో టాటా మోటార్స్, ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, వేదాంత లిమిటెడ్ తదితర కంపెనీలు లాభపడ్డాయి. యస్ బ్యాంక్, టీసీఎస్, ఐటీసీ, ఐసీఐసీఐ, హిందుస్థాన్ యూనీలీవర్ తదితర కంపెనీలు నష్టపోయాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: