దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా మూడో రోజు హుషారుగా ప్రారంభమై స్థిరంగా కొనసాగుతున్నాయి.  ఆసియా మార్కెట్లన్నింటిలో ఈరోజు ర్యాలీ కొనసాగింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు బ్యాంకింగ్, ఫైనాన్స్ సెక్టార్లు మన మార్కెట్లను ముందుండి నడిపించాయి.  ప్రపంచ మార్కెట్ల నుంచి బలహీన సంకేతాలు న్నప్పటికీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకుతో సెన్సెక్స్‌ 124 పాయింట్లు ఎగసి 36,584కు చేరింది. నిఫ్టీ  11వేల ఎగువన కొనసాగుతోంది.   అంతకుముందు సెన్సెక్స్‌ నెల గరిష్టాన్ని తాకగా, నిఫ్టీ 11050ని టచ్‌ చేసింది. దాదాపు అన్ని రంగాలూ  లాభపడుతున్నాయి.


మీడియా, ఆటో స్వల్పంగా నష్టపోతున్నాయి. విప్రో, ఇన్ఫ్రాటెల్‌, వేదాంతా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ, హిందాల్కో, ఐవోసీ, డాక్టర్‌ రెడ్డీస్‌, టెక్‌ మహీంద్రా, ఎస్‌బీఐ  లాభాల్లోనూ జీ, యాక్సిస్‌, హీరో మోటో, టాటా మోటార్స్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, సిప్లా, ఇండస్‌ఇండ్, మారుతీ నష్టాల్లోనూ కొనసాగుతున్నాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (2.60%), ఐసీఐసీఐ బ్యాంక్ (2.55%), రిలయన్స్ ఇండస్ట్రీస్ (2.15%), వేదాంత లిమిటెడ్ (2.00%), హౌసింగ్ డెవలప్ మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (1.32%).  


టాప్ లూజర్లు:
టాటా మోటార్స్ (-2.81%), యాక్సిస్ బ్యాంక్ (-1.72%), హిందుస్థాన్ యూనిలీవర్ (-1.38%),  హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.24%), హీరో మోటోకార్ప్ (-1.10%).

 

మరింత సమాచారం తెలుసుకోండి: