Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
TM
Thu, Jun 27, 2019 | Last Updated 12:06 am IST

Menu &Sections

Search

ఒక్కసారిగా లాభాల బాటలో స్టాక్ మార్కెట్

ఒక్కసారిగా లాభాల బాటలో స్టాక్ మార్కెట్
ఒక్కసారిగా లాభాల బాటలో స్టాక్ మార్కెట్
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఎగ్జిట్ పోల్స్ పుణ్యమా అంటూ స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా పైకి ఏగసింది. ఆదివారం సాయంత్రం లోక్‌సభ ఎన్నికలు ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డాయి. దాదాపు అన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీఏదే పైచేయి కనిపించింది. ఎన్డీఏకు స్పష్టమైన మెజార్టీ కనిపించడంతో స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సోమవారం ఉదయం భారీ లాభాల్లో ప్రారంభమైన సూచీలు...పైపైకి దూసుకుపోతున్నాయి. కొద్దిసేపటి క్రితం బీఎస్ఈ సెన్సెక్స్ 1400 పాయింట్ల మేర లాభాల్లో కొనసాగుతుండగా...నిఫ్టీ 400 పాయింట్ల మేర లాభపడింది.  2014 ఫలితాలతో పోలిస్తే సీట్లు కాస్త తగ్గినా, ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి కావాల్సిన స్పష్టమైన మెజార్టీ ఎన్డీఏకు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

యూపీఏ మ్యాజిక్ మార్క్‌కు దరిదాపులో కూడా లేకపోవడంతో ఇక ఫలితాలు ఎన్డీఏకు అనుకూలంగా వెలువడతాయన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. హంగ్ ప్రభుత్వానికి ఛాన్స్ లేదని, మళ్లీ ఎన్డీయే అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల పట్ల మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. దీంతో కొన్ని రోజులుగా నష్టాల్లో ఉన్న స్టాక్ మార్కెట్లు సోమవారం ఒక్కసారిగా కోలుకున్నాయి. భారీ స్థాయిలో నష్టాలను భర్తీ చేసుకున్నాయి.


బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ సెన్సెక్స్‌ దాదాపు 1300 పాయింట్లు ఎగబాకి మళ్లీ 39వేల మైలురాయిని దాటింది. 2009 మే 18 తర్వాత సెన్సెక్స్‌ ఒక రోజులో ఇంత భారీగా లాభపడటం మళ్లీ ఇప్పుడే. ఈ నేపథ్యంలో బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజీ చరిత్రలో ఇప్పటివరకు నమోదైన ఒక రోజు భారీ ర్యాలీలు కొన్నిటిని చూద్దాం..


పదేళ్ల క్రితం 2009 మే 18న సెన్సెక్స్‌ చరిత్ర సృష్టించింది. ఒకే ఒక్క సెషన్‌లో రికార్డు స్థాయిలో 2,110 పాయింట్లు ఎగబాకింది. కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి రావడం మార్కెట్లలో సరికొత్త హుషారు నింపింది. దీంతో ఆ రోజున సూచీలు దూసుకెళ్లాయి. సెన్సెక్స్‌ ఒక రోజులో 2000 పాయింట్లు లాభపడటం మళ్లీ ఇప్పటి వరకు జరగలేదు. ఆ తర్వాత 2015 జనవరి 15న సెన్సెక్స్‌ 729 పాయింట్లు లాభపడింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక వడ్డీరేట్లను తగ్గించడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలపర్చింది. 


ఆ మరుసటి ఏడాది 2016 మార్చి 1న 777 పాయింట్లు ఎగబాకింది. కేంద్ర బడ్జెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్ల సానుకూలతలు అప్పట్లో మార్కెట్లకు జోష్‌ను నింపాయి. ఆ తర్వాత రెండున్నరేళ్లకు అంటే 2018 అక్టోబరు 12న 732 పాయింట్లు లాభపడింది.  తాజాగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో సూచీ దూసుకెళ్తోంది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో 1290 పాయింట్ల లాభంతో 39,221 వద్ద కొనసాగుతోంది. ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌, మారుతీ, టాటామోటార్స్‌, ఎంఅండ్‌ఎం, యస్‌బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, గ్రాసిమ్‌ ఇండస్ట్రీస్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, టాటాస్టీల్‌లు ర్యాలీని ముందుండి నడిపించాయి.  


మార్కెట్ల ర్యాలీకి సంబంధించి కీలక విషయాలు

ఈ నెలలో సెన్సెక్స్‌ దాదాపు 6శాతం పెరిగింది. కేవలం పదిసెషన్లలో 2,150 పాయింట్లకు పైగా పెరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ షేర్లు బాగా పెరిగాయి.  ఎగ్జిట్‌ పోల్స్‌ తర్వాత సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు మార్కెట్లలో జోష్‌ నింపాయి. ఇప్పటికే ఎన్‌డీఏ ప్రభుత్వం వస్తుందని మార్కెట్లు కొంత ఉత్సాహంగా ఉన్నాయి. దీనికి మిడ్‌క్యాప్‌,స్మాల్‌ క్యాప్‌షేర్ల దూకుడు జోరు పెంచింది. 


సూచీల్లోని ప్రధాన షేర్లు ఈ ర్యాలీని ముందుండి నడిపించాయి. బ్యాంక్‌ నిఫ్టీ పదిసెషన్లలో ఏకంగా 10శాతం లాభపడింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ వంటి షేర్లు దూకుడుగా ఉన్నాయి.  విదేశీ సంస్థాగత మదుపుదార్లు ఈ ర్యాలీని దూకుడుగా నడిపించారు. ఎఫ్‌ఐఐలు ఈ ఏడాది ఇప్పటి వరకు రూ.30వేల కోట్లను మార్కెట్లలోకి తీసుకొచ్చారు. గురువారం ఒక్కరోజే రూ.1,482.99 కోట్ల మేరకు కొనుగోళ్లు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మందగమనాన్ని దృష్టిలో పెట్టుకొని పలు దేశాల కేంద్రీయ బ్యాంక్‌లు వడ్డీ రేట్లను పెంచడంలేదు.


అమెరికా ఫెడ్‌ కూడా వడ్డీరేట్ల పెంపుపై కొంత దూకుడు తగ్గించింది. ఇది భారత మార్కెట్లకు కలిసొచ్చింది. దీనికి తోడు ఆర్‌బీఐ వడ్డీ రేట్లను మరింత తగ్గించే సూచనలు ఉండటం కూడా మరో కారణం. మరోపక్క చైనాతో చర్చలు చాలా బాగా జరుగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ స్వయంగా ప్రకటించడం మార్కెట్లలో జోష్‌ను పెంచింది. దీనిపై మార్కెట్లు సానుకూలంగా స్పందిస్తున్నాయి. 

stock-market
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
కొత్త ఇంటి కోసం చంద్రబాబు అన్వేషణ... ఇండియా భవనంలో మకాం
మరోసారి భేటీ అవనున్న ఇరు రాష్ర్టాల సీఎంలు
ఒంగోలు అత్యాచార ఘటనపై జగన్ ఆరా..
ముంబాయిలో ఎంజాయ్ చేస్తున్న శృతి, రానా, మరోకరు
సెక్సీ టీ షర్ట్ తో శాన్వి
చంద్రబాబు నివాసం హైదరాబాద్ లేక అమరావతా...?
సైరాలో తన పాత్ర ఏమిటో చెప్పేసిన తమన్న
ఆస్ట్రియాలో ఎంజాయ్ చేస్తున్న సాహో బృంధం
విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
స్మోకింగ్ ఇష్యూపై తనదైన శైలిలో స్పందించిన హిరో రామ్
ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలని కోరిన సీఎం జగన్
 ‘కల్కి’ ట్రైలర్ వచ్చేసింది...
కాల్‌మనీ సెక్స్ రాకెట్‌‌పై సీరియసైన సీఎం జగన్
పోలీసు శాఖలో భారీగా నియమకాలు: సుచరిత
బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న షారుక్ కుమార్తే
లండన్ నుంచి వచ్చిన మహేష్
ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రాజీనామా..!
బాలీవుడ్ సినిమాలకు సై చెబుతున్న పూజ
రెండు రాష్ట్రాలు సానుకూలమే...
చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతల సమావేశం
కల్కి చిత్రం నుంచి 'ఎవరో ఎవరో' పాట విడుదల
గ్లామర్ డోస్ పెంచిన రాశీఖన్నా... ఎందుకంటే ?
జూలై 18న ‘రాక్షసుడు’ వస్తున్నాడు...
శాలినిపాండే కల నిజం అవుతుందా..?
వర్షం పడింది... మెట్రోకు కాసుల కురిపించింది
కియారా ప్రేమించిందటా..!
20రోజుల పాటు నగ్నంగా నటించిన అమలపాల్
గ్రామ వాలంటీర్ల విధులు ఏమిటంటే..?
గ్రామ వాలంటీర్లకు ఎంపిక విధానం ఇలా!
నెటిజన్లకు నెహాశర్మ హాట్ ఎగ్జిబిషన్
ఆగస్టు 15 నుంచి అందుబాటులో గ్రామ వాలంటీర్లు... జీవో విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
గత అవినీతిపై విచారణ చేస్తాం... టీటీడీ నూతన చైర్మన్ సుబ్బారెడ్డి
‘ఇస్మార్ట్ శంకర్’ విడుదల వాయిదా... కారణం ఏమిటంటే..?
దిల్ రాజును టీటీడీలో నియమించిన జగన్..?
జల వివాదాల పై 27న సీఎంల సమావేశం
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.