' తెలుగు నేల మీద మీడియాకు, మాఫియాకు యుద్ధం జరుగుతోంది.
మీడియా వైపు మేమున్నాం. ప్రజలంతా మీడియా వైపు ఉండాలి.
మాఫియాకు వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణలో మీడియా కబ్జాకాండ కొనసాగుతోంది.
 దొంగ పత్రాలుతో, పొలీసులు, రెవెన్యూ అధికారులు పేద రైతుల్ని ఒత్తిడి చేసి ఏవిధంగా అయితే భూములు ఆక్రమిస్తారో అదే పద్దతిలో మీడియాను ఆక్రమిస్తున్నారు. 
 నాకు కొందరు మిత్రులు ఉన్నారు.

వారంతా కలసి మోజో టీవీని నెలకొల్పారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా దానిని కూడా కబ్జా చేసే ప్రయత్నంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన అంబరీష్‌ పూరి వ్యవహరిస్తున్నారు. కొంతమంది పోలీసుల సహకారంతో మోజో టీవీ యాజమాన్యాన్ని బెదిరించి లాకున్నారు. సత్యాన్ని చంపేయబోతున్నారు. ఈ లేకి తనాన్ని నిలదీయడానికి అందరూ పోరాడాలి. మీడియా కబ్జాపై జర్నలిస్టులందరూ పోరాడాలి. ప్రజలందరూ మీడియా కబ్జాపై గళం ఎత్తాలని కోరుతున్నా'అని సైబర్‌క్రైం కార్యాలయం వద్ద రవిప్రకాశ్‌ మీడియాతో మాట్లాడుతూ.. అన్నారు. 

...టీవీ9 కేసులో ఫోర్జరీ, డేటా చౌర్యం తదితర నేరారోపణలు ఎదుర్కొంటున్న టీవీ9, మాజీ సీఈఓ రవిప్రకాశ్‌ రెండోరోజు సైబర్‌ క్క్రెం పోలీసుల ఎదుట హాజరయ్యాడు.
బుధవారం మధ్యాహ్నం ఆయన సైబరాబాద్‌ సైబర్‌ క్క్రెం కార్యాలయానికి చేరుకున్నారు. 

ఫోర్జరీ, నిధుల మళ్లింపు, డేటా చౌర్యం కింద నమోదైన 2 కేసుల్లో ఇప్పటికే పోలీసులు సిద్ధం చేసుకున్న ప్రశ్నావళి ప్రకారం రవిప్రకాశ్‌ను నిన్న ఐదు గంటల పాటు ప్రశ్నించారు.
పోలీసుల ప్రశ్నలకు రవిప్రకాష్‌ ఏమాత్రం సహకరించలేదని,సమాచారం. 
ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో రవిప్రకాశ్‌ పై సెటైర్లు పెరిగి పోతున్నాయి... 
"మీడియా, మాఫియా మధ్య యుద్ధం జరుగుతోంది. మాఫియాకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడాలి"  అన్న రవిప్రకాష్.. కి కౌంటర్ గా....
తమలాంటి వారివల్ల మాకు ఆ రెండిటి మధ్య పెద్ద తేడా కనబడడం లేదు రవిప్రకాష్ గారూ. మీ చావు మీరు చావండి. '' అంటూ ఫేస్‌ బుక్‌లో ఒక సీనియర్‌ జర్నలిస్టు కామెంట్‌ చేశారు.

  

మరింత సమాచారం తెలుసుకోండి: