ప్రతి ఒక్కరు వ్యాపారవేత్తలు కావాలని ఆశిస్తారు.  కొందరు వాటిని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు.  కొందరు వాటికి రూట్ మ్యాప్ వేస్తారు..  ఎంత కష్టం వచ్చినా సరే అనుకున్న దాన్ని పక్కన పెట్టకుండా కష్టపడతారు.  ఒక్కోసారి చేస్తున్న బిజినెస్ సక్సెస్ కాదేమో అనిపిస్తుంది.  లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తారు. అయితే, ఎప్పటి వరకు అది సక్సెస్ అవుతుంది అన్నది చెప్పలేం.  చాలా పెద్ద ప్రాసెస్.  అందుకే చాలా మంది బిజినెస్ ను మధ్యలోనే విరమించుకుంటున్నారు.  


తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే బిజినెస్ లు కొన్ని ఉన్నాయి.  వాటి వలన మీకు తప్పకుండా లాభం చేకూరుతుంది.  అవేంటో ఇప్పుడు చూద్దాం.  
  1. బేబీ సిట్టింగ్ :  ఈ రోజుల్లో ఇది లాభసాటి వ్యాపారంగా మారింది.  భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు.  పిల్లను ఇంట్లో వదిలి వెళ్ళాలి. అది చాలా కష్టంతో కూడుకున్నది.  అందుకే బేబీ సిట్టింగ్ లు వస్తున్నాయి.  దీనికి పెట్టుబడి పెద్దగా అవసరం లేదు.  ఒక ఇల్లు.. పిల్లలు ఆడుకోటాడానికి కావాల్సిన బొమ్మలు ఉంటె చాలు.  వ్యాపారం స్టార్ట్ చెయ్యొచ్చు.  


2. బ్యుటీషియన్స్ : అందంగా కనిపించాలని అందరికి ఉంటుంది.  ప్రతి ఒక్కరు ఇంట్లో మేకప్ వేసుకోలేరు.  అది చాలా కష్టం.  అందుకే పార్లర్ కు వెళ్తుంటారు.  ఇండియాలో బ్యూటిషియన్స్ కొరత చాలా ఉంది.  బ్యూటిషియన్స్ ను అందించే సంస్థను స్థాపిస్తే మంచి లాభాలు వస్తాయి. 


3. టిఫిన్ సర్వీస్ :  ఏం చేసినా పొట్ట కూటి కోసమే అంటారు. మనిషికి ఆకలి లేకుంటే  ఎందుకు ఉంటుంది.   పట్టణాల్లో, నగరాల్లో కూడా టిఫిన్ సెంటర్స్ విరివిగా వెలుస్తున్నాయి.  తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభం.  వెరైటీని ఇష్టపడే  నగరాల్లో వెరైటీ వంటలతో ఆకట్టుకోగలిగితే అంతకు మించిన వ్యాపారం మరొకటి ఉండదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: