బ్యాంకులు వినియోగదారులకు వడ్డీ రేట్లు ఎక్కువ విధిస్తుంది. వడ్డీ రేట్లు అధికంగా ఉండటంతో వినియోగదారులు బ్యాంకులను చుట్టూ తిరగలేక ఆన్ లైన్ సౌకర్యాలను పొందుతున్నారు. గతంలో ప్రధాన మంత్రి మోదీ పెద్ద నోట్ల రద్దు సమయంలో ఈ ఆన్ లైన్ ప్రక్రియ ఎక్కువగా జరిగింది. దీంతో బ్యాంకు వెళ్లే పరిస్థితి తక్కువైంది. ఆన్ లైన్ ద్వారా ఎక్కువ మొత్తంలో నగదు బదిలీ అవుతుండటంతో వాటీపై కూడా ఆర్బీఐ వడ్డీ రేట్లు విధించింది.

తాజాగా ఆర్బీఐ జరిపిన కమిటీ సమావేశంలో ఆన్ లైన్ నగదు బదిలీ విధానాన్ని ఉచితం చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు డిజిటల్‌ లావాదేవీలను మరింత ప్రోత్సహిస్తూ రిజర్వు బ్యాంకు(ఆర్‌బీఐ) మంగళవారం కీలక ప్రకటన చేసింది. వచ్చే నెల 1 నుంచి ఆన్‌లైన్‌లో ‘రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్‌(ఆర్‌టీజీఎస్‌)’, ‘నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌(నెఫ్ట్‌)’ ద్వారా జరిపే నగదు బదిలీలపై రుసుములేవీ వసూలు చేయబోమని వెల్లడించింది.

కాబట్టి బ్యాంకులు కూడా వినియోగదారుల నుంచి ఆ రుసుములు వసూలు చేయొద్దని, అదే రోజు నుంచి వారికి సంబంధిత ప్రయోజనాన్ని బదిలీ చేయాలని ఆదేశించింది.  సాధారణంగా ఆర్‌టీజీఎస్‌, నెఫ్ట్‌ ద్వారా జరిగే లావాదేవీలకు బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ కనీస రుసుములు వసూలు చేస్తుంది. దీంతో బ్యాంకులు వినియోగదారులపై ఆ ఛార్జీలను విధిస్తాయి. ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం, నగదు చలామణి తగ్గించడం, డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో తాజాగా ఈ ఛార్జీలను ఆర్‌బీఐ రద్దు చేసింది.

భారీ మొత్తంలో నిధులను బదిలీ చేసేందుకు ఆర్‌టీజీఎస్‌, రూ.2 లక్షల్లోపు నగదును బదిలీ చేసేందుకు నెఫ్ట్‌ ఉపయోగపడతాయి. ప్రస్తుతం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) నెఫ్ట్‌ లావాదేవీలకు రూ.1 నుంచి రూ.5 వరకు, ఆర్‌టీజీఎస్‌ లావాదేవీలకు రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: