దేశ అత్యున్నత బ్యాంక్ RBI ఖాతాదారులకు తీపి కబురు చెప్పింది.డిజిటల్ ఇండియా లో భాగంగా అందరిని డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా NEFT మరియు RTGS కు వసూలు చేస్తున్న డబ్బులను బ్యాంకు ఖాతాదారులకు లబ్ధి చేకూరే విధంగా నిర్ణయం తీసుకుంది.దీనిని బ్యాంకు అదే రోజు ఖాతాదారులకు చెల్లించాలని తెలిపింది.

RBI సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది.దీనివల్ల డిజిటల్ లావాదేవీలు పెరిగే అవకాశం ఉందని RBI భావిస్తుంది.
భారతదేశంలో అతి పెద్ద బ్యాంకు అయిSBI బ్యాంక్ NEFT లావాదేవికి రూ 1 నుండి 5,RTGS లావాదేవికి రూ 5 నుండి 50 లను వసూలు చేస్తుంది.ఇప్పటినుండి అవి వసూలు చేయడానికి అవసరం లేదు అని ఆర్బీఐ చెప్పింది.

సమీక్షలో భాగంగా కీలకమైన నిర్ణయం జులై 1 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది.దీనివల్ల డిజిటల్ లావాదేవీలు పెరగడమే కాకుండా డబ్బు వాడకం కూడా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారుభావిస్తున్నారు.

NEFT ద్వారా గరిష్టంగా రెండు లక్షల వరకు లావాదేవీలు జరపవచ్చు.RTGS ద్వారా పెద్ద మొత్తం లో డబ్బు ట్రాన్స్ ఫర్  చేయవచ్చు.
NEFT అంటే నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్ ఫర్ 
RTGS అంటే రియల్ టైం గ్రాస్ సెటిల్మెంట్ సిస్టం 
సర్ చార్జీలతో సతమతం అవుతున్న వినియోగదారులకు ఇది  కొంత వరకు ఉపశమనం అనే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: