జీడీపీ పతనమవుతోంది...ప్రైవేటు పెట్టుబడులు క్షీణించాయి....కొనుగోళ్లు పడిపోయాయి...నాన్‌బ్యాంకింగ్‌యేతర ఆర్థిక సేవల సంస్థలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నాయి. పారిశ్రామిక రంగంలో ఉత్పత్తులు తగ్గిపోయాయి....దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో కొనసాగుతోంది. మరోపక్క ద్రవ్యోలోటు కొరత సంబంధిత రంగాలను కోలుకోకుండా చేస్తోంది. ఆర్‌బీఐ రేపో రేటును తగ్గిస్తున్నప్పటికీ పరిస్థితిలో మార్పు రావడంలేదు. ఆర్థిక వ్యవస్థలో ఎన్నో సవాళ్లు, మరెన్నో అవరోధాల నేపథ్యంలో మోడీ 2.0 ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ప్రవేశపెట్టబోయే తొలి బడ్జెట్‌ కసరత్తులు ప్రారంభమయ్యాయి. కేటాయింపులు, సమాలోచనలకు సంబంధించిన అసలైన ప్రక్రియ ఈ సోమవారం నుంచి ప్రారంభమవనుంది. ఈ నేప‌థ్యంలో...అంద‌రి చూపు తెలుగింటి కోడ‌లు... తొలి మహిళ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌పై ప‌డింది.


జూలై 5న ప్రవేశపెట్టనున్న 2019-20 బడ్జెట్‌ను పూర్తి స్థాయిలో తొలి మహిళ ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ప్రవేశపెట్టనున్నారు. అసలే దేశ ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా ఉన్న నేపథ్యంలో కొత్త ఆర్థిక ఎలా వ్యవహరిస్తారనే అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏఏ రంగాలకు ప్రాధాన్యత నిస్తారు, పన్నుల మినహాయింపులు, పథకాలు వంటి అంశాలపై ఆసక్తి నెలకొంది. దేశ ఆర్థిక వ్యవస్థ గత ఐదేళ్లలో లేని విధంగా మందగమనంలో కొనసాగు తున్న నేపథ్యంలో ఈసారి ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. బడ్జెట్‌లో అన్నీ రంగాలకు సమ ప్రాధాన్యతను ఇస్తారా లేక కొన్ని కీలకమైన రంగా లకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారా అనే అంశాలపై చర్చలు మొదలయ్యాయి. ముఖ్యంగా అన్నీ రంగాలకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ భరోసాని వ్వాల్సి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆర్థిక గడ్డు పరిస్థితుల నేపథ్యంలో ఈసారి ఆర్థిక నిర్వహణ మోడీ కేబినెట్‌కు కఠినమవ‌నుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 


దేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి అత్యంత కీలకం కానున్న ఈ బడ్జెట్‌ ఇది. బడ్జెట్‌లో అన్నీ రంగాలకు ప్రాధాన్యత ఇస్తారా లేదా కీలకమైన రంగాలకు ఉద్దీపనలు ప్రకటిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. ఈ నేప‌థ్యానికి తోడుగా కొత్త ఆర్థిక మంత్రి కావడంతో అన్నీ రంగాల నుంచి ఆమెకు సలహాలు సూచనలు అందుతున్నాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగాలు, వ్యపారవేత్తలు, సంస్థల నుంచి ఆమెకు సలహాలు సూచనలు అందుతున్నాయి. సోషల్‌ మీడియా వేదికగా కూడా నిర్మలాసీతారామన్‌కు అనేక సలహాలు, సూచనలు అందుతు న్నాయి. ట్విట్టర్‌ వేదికగా నెటిజన్లు పలు ఆర్థిక సలహాలను పంచుకున్నారు. తనకు విలువైన సలహాలు, సూచనలు తెలియజేసిన స్కాలర్లు, ఆర్థిక వేత్తలు, ఔత్సాహిక ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌మీడియా ద్వారా తమ అభిప్రా యాలను తెలిపిన వారందరినీ నిర్మలా సీతారామన్‌ కృతజ్ఞతలు తెలియజేశారు. వ్యక్తిగత ఆదాయపు పన్నులో మార్పు లు, కార్పొరేట్‌ పన్నుల్లో 25 శాతం తగ్గింపు, స్టార్టప్‌లకు పన్నుల మిన హాయింపు, పన్నుల సంస్కరణలు, ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యూ యల్‌(ఏటీఎఫ్‌)పై ఎక్సైజ్‌ పన్ను తగ్గింపు, అల్యూమినియంపై కస్టమ్స్‌ డ్యూటీ పన్నులు తగ్గింపు వంటి డిమాండ్లు ఆర్థిక నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి.వీటిని ఏ మేర‌కు నెర‌వేరుస్తారోర వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: