ప్రముఖ టెక్ సంస్థ అయిన ఆపిల్ చిత్ర నిర్మాణంలోకి కూడా అడుగు పెట్టనుందా? రిపోర్ట్స్ ప్రకారం అవుననే అంటున్నాయి. ఆపిల్, ఆపిల్ స్ట్రీమింగ్ సర్వీసెస్ ని లాంచ్ చేయనుందట. అయితే ఈ సర్వీసుల్లో ఇప్పటికే దిగ్గజాలై ఉన్న నెట్ ఫ్లిక్స్, అమెజాన్ నుండి పోటీ ఉంది. అయినా జనాల హృదయాలను గెలుచుకోవాలనుకుంటుంది. టెలివిజన్ సర్వీసులే కాకుండా, హాలీవుడ్ చిత్రాల్ని కూడా నిర్మించనుందట.

 

హాలీవుడ్ చిత్రాల్ని రూపొందించి, ఆస్కార్ ఒడిసి పట్టాలనుకుంటుందట. ప్రస్తుతం ఒక ఆరు సినిమాల్ని నిర్మించాలని అనుకుంటుంది. తక్కువ బడ్జెట్ చిత్రాలని నిర్మించి ఆస్కార్ బరిలో నిలవాలని అనుకుంటుంది. హాలీవుడ్ కథనాల ప్రకారం ఆపిల్ కొత్త డైరెక్టర్లని ప్రాజెక్టులకి ఎంచుకునే దశలో ఉంటుందట.

 

ఆపిల్ ప్రస్తుతం 5 మిలియన్ డాలర్ల నుండి, 35 మిలియన్ డాలర్ల వరకు వెచ్చించనుందట. కథని బట్టి బడ్జెట్ ఖర్చు చేసి ఆస్కార్ బరిలో నిలిచే చిత్రాలను నిర్మించే లక్ష్యంతో ఉందట. మొన్న ఆస్కార్ అందుకున్న "రోమా" సినిమా వీరికి ప్రేరణ గా నిలిచింది. తక్కువ బడ్జెట్ లో చిత్రాలను నిర్మించి ఆస్కార్ అందుకోవాలని చూస్తుంది.

 

ఆపిల్ సంస్థ ఇప్పటికే చిత్ర నిర్మాణానికి సంబంధించిన వారిని నియమించుకునే పనిలో ఉందట. స్క్రిప్ట్ రైటర్స్, స్క్రీన్ ప్లే, డైరెక్టర్లను హైర్ చేసుకుంటుంది. ఆపిల్ టి. వి స్ట్రీమింగ్ సర్వీసెస్ ని అందుబాటులోకి ఇంకొన్ని రోజుల్లో తెస్తుందట.  టెక్ సంస్థ అయిన్ అపిల్ సినిమా నిర్మాణంలో ఏ విధంగా విజయం సాధిస్తుందో, ఇంకా ఆస్కార్ ని గెలుస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: