భార‌తీయ దిగ్గ‌జ వ్యాపార కుటుంబం అయిన అంబానీల‌కు ఊహించ‌ని షాక్ ఎదురైంది. ఇప్ప‌టికే ఈ కుటుంబంలోని రెండో వ్య‌క్తి అయిన అనిల్ అప్పుల ఊబిలో కూరుకుపోగా...అంత‌కంటే బాధాక‌ర‌మైన సంఘ‌ట‌న మ‌రొక‌టి ఎదురైంది.  2008 వరకు ప్రపంచంలోని అత్యంత సంపన్నుల్లో ఒకడిగా ఉన్న స‌మ‌యంలో అనిల్ అంబానీ మొత్తం ఈక్విటీల విలువ 42 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.2.93 లక్షల కోట్లు). ఇప్పుడు అది సగం బిలియన్‌‌‌‌ డాలర్లకు (దాదాపు రూ.3,600 కోట్లు) పడిపోయింది. అప్పుల కోసం వివిధ కంపెనీల్లో ఆయన కుదువబెట్టిన షేర్ల విలువను కలపగా వచ్చిన మొత్తం ఇది. దీంతో ఈ వాణిజ్యవేత్త బిలియనీర్‌‌‌‌ క్లబ్‌‌‌‌ నుంచి వైదొలగాల్సిన దుస్థితి వచ్చింది. ఆర్థిక సమస్యలు, బకాయిల చెల్లింపులో విఫలం కావడం, టెలికం మార్కెట్‌‌‌‌ నుంచి వైదొలగాల్సి రావడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఆయన కుదువబెట్టిన షేర్ల విలువ రూ.765 కోట్లను కూడా మించడం లేదు.


నాలుగు నెలల క్రితం వరకు అనిల్‌‌‌‌ అంబానీ ‘రిలయన్స్ గ్రూప్‌‌‌‌’ విలువ రూ.ఎనిమిది వేల కోట్ల వరకు ఉండేది. అప్పులు చెల్లింపులో పలుసార్లు విఫలం కావడంతో అనివార్యంగా షేర్లను లెండర్లకు అప్పగించారు. దీంతో వాటి విలువ అమాంతం పడిపోయింది. తాజాగా రూ.ఆరు వేల కోట్లకు రిలయన్స్‌‌‌‌ నిప్పన్‌‌‌‌ లైఫ్‌‌‌‌ అసెట్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌ (ఆర్‌‌‌‌ఎన్‌‌‌‌ఎల్‌‌‌‌ఏఎం)లో 10.75 శాతం వాటా అమ్మేశారు. ఇది కూడా ఆయన ఈక్విటీల విలువ తగ్గడానికి కారణం. మార్కెట్‌‌‌‌ విలువలు పడిపోవడం కూడా కంపెనీకి కోలుకోని నష్టాలను మిగిల్చింది. గత ఏడాది మార్చి నాటికి రిలయన్స్‌‌‌‌ గ్రూపు కంపెనీల అప్పుల మొత్తం రూ.1.7 లక్షల కోట్లకు చేరింది. ఈ భారాన్ని తగ్గించుకోవడానికి ఆస్తులనూ వ్యాపారాలనూ అమ్మాలన్న ప్రయత్నాలు కొంత వరకే సఫలమయ్యాయి. ఉదాహరణకు తన అన్న ముకేశ్‌‌‌‌ అంబానీ కంపెనీ జియోకు రూ.23 వేల కోట్ల విలువైన స్పెక్ట్రం, ఇతర టెలికం ఆస్తుల అమ్మకాన్ని ప్రభుత్వం అడ్డుకుంది. దీంతో అప్పులు తీర్చడం కష్టంగా మారింది. దీంతో ఎరిక్సన్ వంటి కంపెనీ బకాయిల వసూలుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అన్న సర్దుబాటు చేయడంతో అనిల్ ఎరిక్సన్‌‌‌‌ కేసు నుంచి గట్టెక్కారు. గత 14 నెలల్లో రూ.35 వేల కోట్ల విలువైన అప్పులు చెల్లించామని ఆయన ప్రకటించారు. మిగతాన్నింటినీ కూడా చెల్లిస్తామని తెలిపారు.
కాగా, అనిల్ గ్రూపునకు ఉన్న అతిపెద్ద ఆస్తి ఆర్‌‌‌‌ఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ఏఎం. స్టాక్‌‌‌‌ మార్కెట్‌‌‌‌లో దీని విలువ రూ.13,500 కోట్లు. దీంతో వాటా అమ్మడంతో రిలయన్స్‌‌‌‌కు రూ.ఆరు వేల కోట్లు వచ్చాయి. ఈ ఏడాది జూన్‌‌‌‌ 11నాటికి రిలయన్స్‌‌‌‌ పవర్‌‌‌‌, రిలయన్స్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రా, రిలయన్స్‌‌‌‌ హోం ఫైనాన్స్‌‌‌‌, ఆర్‌‌‌‌కామ్‌‌‌‌ మొత్తం మార్కెట్‌‌‌‌ క్యాప్‌‌‌‌ రూ.7,539 కోట్లు ఉంది. ఆర్‌‌‌‌నావల్‌‌‌‌లోని తన మొత్తం వాటాను అనిల్‌‌‌‌ కుదువబెట్టారు. ఈ కంపెనీ దివాలా ప్రక్రియ మొదలుపెట్టాలంటూ ఐడీబీఐ బ్యాంక్‌‌‌‌ గత ఏడాది ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. రిలయన్స్‌‌‌‌ క్యాపిటల్‌‌‌‌ 97 శాతం, ఆర్‌‌‌‌కామ్‌‌‌‌లో 22 శాతం, ఆర్‌‌‌‌ పవర్‌‌‌‌లో 79 శాతం, హోంఫైనాన్స్‌‌‌‌లో 81 శాతం, ఆర్‌‌‌‌ ఇన్‌‌‌‌ఫ్రాలోని 99 శాతం వాటాలను ఆయన కుదువబెట్టారు. ప్రమోటర్‌‌‌‌ వాటాల విలువ రూ.3,651 కోట్లు కాగా, వీటి విలువను మినహాయించగా ఆయన సంపద రూ.765 కోట్లకుపడిపోయింది. అనిల్‌‌‌‌ మొత్తం సంపద ముకేశ్‌‌‌‌ అంబానీ ఇంటి విలువలో సగం కూడా ఉండదని ఒక బ్యాంకర్‌ వ్యాఖ్యానించ‌డం...అనిల్ ప‌రిస్థితికి నిద‌ర్శ‌న‌మ‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: