ప్రపంచంలో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ గురించి తెలియనివారు చాలా అరుదు. దాదాపు 12 సంవత్సరాలు ఆయన ప్రపంచంలో అతిపెద్ద ధనవంతుడిగా నిలిచారు. ఇప్పటికి కూడా బిల్ గేట్స్ ప్రపంచ కుబేరుల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. అమెజాన్ జెఫ్ బెజోస్ మొదటి స్థానం పొందారు. తన జీవితంలో ఆయన చేసిన ఓ పెద్ద తప్పును గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.  

మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లలో ప్రస్తుతం రెండు పేర్లు ఉన్నాయి-ఆండ్రాయిడ్, ఐఓఎస్. ప్రపంచంలోని అత్యధిక స్మార్ట్ ఫోన్లలో ఈ రెండు మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ లే కనిపిస్తాయి. దీనికి ముందు మైక్రోసాఫ్ట్ కి కూడా తనదైన మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉండేది. దానిని విండోస్ ఫోన్ లో అందుబాటులో ఉంచారు. కానీ మైక్రోసాఫ్ట్ మొబైల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ లకు పోటీ ఇవ్వలేక 2017 లో కంపెనీ దానిని మూసివేసింది.  

గూగుల్ తయారుచేసిన ఆండ్రాయిడ్ నోకియా మొబైల్ ఓఎస్ ను వెనక్కి నెట్టడమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా తనదైన ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. గూగుల్ కి ఆండ్రాయిడ్ అభివృద్ధి చేసే అవకాశం ఇవ్వడమే తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పుగా మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు.  ఆండ్రాయిడ్ ను స్టాండర్డ్ నాన్ యాపిల్ ఫోన్ ప్లాట్ ఫామ్ గా అభివర్ణించారు. ఆండ్రాయిడ్ వంటి ప్లాట్ ఫామ్ తయారుచేయడం మైక్రోసాఫ్ట్ కి సహజమని , 2005కి ముందు వరకు ఆండ్రాయిడ్ ఒక స్వతంత్ర ప్లాట్ ఫామ్ గా ఉండేదని అన్నారు.  కానీ గూగుల్ దీనిని 2005లో 50 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది. 


వర్జ్ రిపోర్ట్ ప్రకారం మైక్రోసాఫ్ట్ ఆరంభ మొబైల్ ప్రయత్నాలను దెబ్బ తీయడంపైనే గూగుల్ దృష్టి పెట్టిందని గూగుల్ మాజీ సీఈవో ఎరిక్ ష్మిట్ చెప్పారు. మైక్రోసాఫ్ట్ మొబైల్ వ్యూహం తమకు ఆందోళన కలిగించేదని, అది విజయవంతం అవుతుందేమోనని కంగారు పడేవాళ్లమని ఆయన 2012లో తెలిపారు.  ఏదైతేనేం గూగుల్ సంస్థ తనకు పోటీ దారునిగా ఉన్న  మైక్రోసాఫ్ట్ సంస్థను తొక్కేసి ఆండ్రోయిడ్ ఆపరేటింగ్ సిస్టంతో  ప్రపంచంలో టాప్ ఆపరేటింగ్ సిస్టం గా పేరు తెచ్చుకుంది.   


మరింత సమాచారం తెలుసుకోండి: