భారతీయ బ్యాంకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ఎట్ట‌కేల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా ఆన్‌లైన్ ద్వారా జరిపే లావాదేవీలపై విధించే చార్జీలను జూలై 1 నుంచి ఎత్తివేస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ గ‌త నెల‌లో ప్రకటించింది. ఈ ప్రయోజనాలను బ్యాంకులు తమ ఖాతాదారులకు అందించాలని ఆర్బీఐ సూచించింది. అయితే, దాదాపు ప‌ద‌కొండు రోజుల నిరీక్ష‌ణ త‌ర్వాత ఆన్‌లైన్ లావాదేవీల‌పై ఛార్జీల‌ను ఎత్తివేసింది. ఈ విష‌యాన్ని అధికారికంగా ఇవాళ ఎస్‌బీఐ ప్ర‌క‌టించింది.


నెఫ్ట్ ద్వారా రూ.2 లక్షల వరకు పంపుకోనుండగా, అదే ఆర్టీజీఎస్ ద్వారా ఎంతైన పంపుకోవచ్చు. బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ప్రతి నెఫ్ట్ లావాదేవీలపై రూ.1 నుంచి రూ.5 వరకు వడ్డీస్తుండగా, ఆర్టీజీఎస్ లావాదేవీలపై రూ.5 నుంచి రూ.50 వరకు వసూలు చేస్తోంది. ఈ నెల 6న తన పరపతి సమీక్షలో ఆర్బీఐ చార్జీల ఎత్తివేత‌ నిర్ణయం తీసుకుంది. ఇమిడియేట్ పేమెంట్ స‌ర్వీస్‌(ఐఎంపీఎస్‌), నెఫ్ట్‌, ఆర్టీజీఎస్ లాంటి లావాదేవీల‌కు చార్జీలు ఇక నుంచి వ‌సూల్ చేయ‌రు. యోనో యాప్ ద్వారా మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ చేసే వారికి చార్జీలు ఉండ‌వు. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ఐఎన్‌బీ, మొబైల్ బ్యాంకింగ్ కూడా చార్జీలు ఉండ‌వు. 
 


మరింత సమాచారం తెలుసుకోండి: