నేడు స్వల్పలాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు.నిఫ్టీ 25 పాయింట్లు లాభపడి 11,687, సెన్సెక్స్‌ 84 పాయింట్లు లాభపడి 39,215 వద్ద ట్రేడింగ్‌ను ముగించాయి.ఏషియన్‌ పెయింట్స్‌,హెచ్‌సీఎల్‌ టెక్‌,టెక్‌మహీంద్రా, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌,బజాజ్‌ ఫినాన్స్‌  షేర్లు కొంత లాభించాయి.
ఆటో సూచి తప్ప నిఫ్టీలో మిగిలినవన్ని ట్రేడింగ్ ను లాభాలతో ముగించాయి.డీసీబీ బ్యాంక్‌ షేర్లు 14శాతం తగ్గాయి. ఈ బ్యాంక్‌ జూన్‌ మూడువ వారం నాటికి అంచనాల కన్నా తక్కువ స్థాయిలో ఫలితాలను ప్రకటించడంతో షేర్లు తగ్గుముఖం పట్టాయి. మిగతా బ్యాంక్ లు యధావిధంగా ఉన్నాయి.
ఎన్‌పీఏల ఒత్తిడి కూడా దీనిపై తీవ్రంగా ఉంది. నేడు 7 శాతం పెరిగిన హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ.నిన్న కంపెనీ నికర లాభంలో 42శాతం వృద్ధి నమోదు చేయడంతో నేడు ఆ షేరు భారీ ర్యాలీ నమోదు చేసింది.


మరింత సమాచారం తెలుసుకోండి: