ఒకప్పుడు మనకు నచ్చిన వస్తువు ఏదైనా కొనాలంటే ఊరంతా తిరిగి కొనేవాళ్ళం.ఒకవేళ నచ్చిన వస్తువు దొరక్క పోతే ఎదో ఒకటి కొనుక్కునే వాళ్ళం కానీ ఇప్పుడు అలా కాదు మనకు నచ్చిన వస్తువు మన ఇంటికొస్తుంది అది కూడా కాలు బయట పెట్టకుండా అదే ఆన్ లైన్ షాపింగ్.అమెజాన్, ఫ్లిప్ కార్ట్ వంటి దిగ్గజ సంస్థలు ఇండియా లో పేరుమోసిన ఒన్ లైన్ షాపింగ్ సంస్థలు.

అమెజాన్ లో అయితే గుండు సూది నుండి పెద్ద పెద్ద వస్తువుల వరకు దొరకని వస్తువులే ఉండవు. ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీ లను దాటుకుని  అమెజాన్ ముందుకు దూసుకు  పోతుంది.అప్పుడప్పుడు పండగలకు, కొన్ని ముఖ్యమైన రోజుల్లో మార్కెట్ లో దొరికే రేటు కంటే తక్కువకే వస్తువుల్ని విక్రయిస్తుంది అమెజాన్, అందుకే ప్రజలు కూడా ఆన్ లైన్ షాపింగ్ అంటే అంత క్రేజ్ చూపిస్తారు.

కష్టమర్లని ఆఫర్లతో ఆకర్షించడం అమెజాన్ కంపెనీ  ఆనవాయితీ, అదే ఆ కంపెనీకి లక్షల్లో నష్టం తీసుకొచ్చింది. అనుకోకుండా కొన్ని టెక్నికల్ కారణాల వల్ల 9లక్షలకు అమ్మవాల్సిన కెమెరా గేర్ ను పొరబాటున కేవలం 6,500 రూపాయాలకు అమ్మేసింది అమెజాన్.దింతో కెమెరా కొన్న వ్యక్తి ఆనందంతో అమెజాన్ కి థాంక్స్ చెప్పాడు.
అమెజాన్ సీఈఓ కి షాక్ తగిలింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: