'టీ ' జన జీవితంలో విడదీయరాని బంధం అయింది. కోట్లాది మంది రోజూ తాగుతున్నారు. టీ తాగకుండా ఉండలేని స్థితికి చేరుకున్నారు. ప్రపంచ వ్యాప్తంగా రకరకాల ఫ్లేవర్స్‌లలో టీ దొరుకుతోంది. ఇండియాలో ఏర్పాటైన 'టీ బాక్స్‌' అతి తక్కువ సమయంలో టాప్‌ రేంజ్‌లోకి చేరుకుంది.

వీరు డిఫరెంట్‌ ఫ్లేవర్స్‌తో పాటు భిన్నమైన టీ ప్రొడక్ట్స్‌ను విక్రయిస్తున్నారు. ఒక్కసారి టీ బాక్స్‌ తయారు చేసిన తేయాకుతో టీ చేసుకుంటే ..జీవితాంతం మరిచి పోలేరు. దీంతో ప్రపంచ తేయాకు పరిశ్రమలో ఈ కంపెనీ దుమ్ము రేపుతోంది.

బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఈ కంపెనీ తన వ్యాపారాన్ని మరింత విస్తరించుకునే పనిలో నిమగ్నమైంది. దుబాయి కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ పెట్టుబడి పరంగా మొదటి శ్రేణిలో ఉన్న ఎన్‌బి వెంచర్స్‌ ఊహించని దానికంటే ఎక్కువగా ఇన్వెస్ట్‌ చేసింది. ఏడేళ్ల వయసు కలిగిన టీబాక్సు కంపెనీ..ఇండియాతో పాటు అమెరికా,రష్యా, తదితర దేశాలకు విస్తరించింది. ఒక బిలియన్‌ కప్పుల టీని 117 దేశాలకు విక్రయించి టీ బాక్సు రికార్డు బ్రేక్‌ చేసింది.

ఈ నేపథ్యంలో తమ ఉత్పత్తులను దేశమంతా పరిచయం చేయడానికి టీ బాక్సు కొత్త ఐడియాకు శ్రీకారం చుట్టింది. ఉచితంగా తమ ప్రొడక్ట్స్‌ బాగున్నాయో లేదోననే పరీక్ష చేసేందుకు గాను బెంగళూరు ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ పోర్ట్‌ లో ఓ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. దేశంలోని 200 ప్రాంతాలో ప్రత్యేకంగా టీ ప్లాంట్లను ఏర్పాటు చేసింది టీ బాక్స్‌. బ ధరలు ఎక్కువగా ఉన్నప్పటికీ సరే కస్టమర్లు లెక్క చేయకుండా , ఈ కంపెనీ ఛాయ్‌ కావాలని కోరుతున్నారు.
డిమాండ్‌ పెరగడంతో పాటు టీబాక్స్‌ కు ఎనలేని క్రేజ్‌ ఉండడంతో తాము భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఎన్బీ కంపెనీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ నీలేష్‌ భట్నాగర్‌ వెల్లడించారు. క్వాంటిటీ కంటే క్వాలిటీ పైనే ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో తాము టాప్‌ రేంజ్‌కు చేరుకున్నామని ..వారంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: