ఈ రోజు బ్యాంకింగ్ రంగం మెడ కు గుదిబండలా తయారై బ్యాంకింగ్ వ్యవస్థ కుదేల్ అవ్వడానికి కారణభూతమైన అతి పెద్ద సమస్య ఈ ఈ నాను పెర్ఫార్మింగ్ అసెట్స్ అనగా నిరర్ధక ఆస్తులు. ఈ సమస్య వల్ల నష్టాల బాట పట్టిన బ్యాంకులు చాలానే ఉన్నాయని చెప్పవచ్చు. ఈ నిరర్ధక ఆస్తుల సమస్య వల్ల అర్హులైన వారికి బ్యాంకింగ్ రంగం నుంచి రుణాలు అందట్లేదని మనందరికీ తెలుసు.


మన దేశంలో ఉన్న అన్ని బ్యాంకులు ఎంతోకొంత బుద్ధి పూర్వకంగా రుణం ఎగవేసిన వారి వల్ల ఈ నిరోధక ఆస్తుల బారిన పడ్డాయని చెప్పవచ్చు. రుణాల మంజూరు చేసేటప్పుడు జరిగే అవకతవకల వల్ల గాని, బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పు తిరిగి చెల్లించక పోవడం వల్ల గానీ ఈ నిరర్ధక ఆస్తులు ఏర్పడతాయి. ఈ నిరర్ధక ఆస్తుల వల్ల బ్యాంకింగ్ రంగానికి జరిగే హాని చాలా ఎక్కువ. కొన్ని సందర్భాలలో బ్యాంకు మనుగడే కష్టమయ్యే పరిస్థితి కూడా ఉత్పన్నమవుతుంది.


మనదేశంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల లో లో అప్పు తీసుకుంటే ఎగవేత చాలా సులువు అన్న భావం చాలామంది ప్రజలు పాతుకుపోయింది. తీసుకున్న అప్పును తిరిగి చెల్లించే వారి సంఖ్య చాలా తక్కువ శాతం అన్నది జగమెరిగిన సత్యం. చిన్నచిన్న వ్యక్తిగత రుణాలు గృహ రుణాలు వాహన రుణాలు వంటి వాటి వసూలు ఉన్నప్పటికీ , బడా కార్పొరేట్ వ్యాపారులు తీసుకునే రుణాలు వసూలు చేయడం చాలా కష్టమవుతుంది.
బ్యాంకు ఇచ్చిన రుణం వరుసగా మూడు నెలలు వసూలు కాకుంటే అది ఇది నిరంతర ఆస్తిగా మారిపోతుంది.


ఏదైనా బ్యాంకు ఇచ్చిన అప్పు వసూలు కాకుంటే, అది నిరర్ధక ఆస్తిగా గా మారితే దానిని వసూలు చేయడానికి పాటించవలసిన నియమ నిబంధనలు చాలా ఎక్కువ, దానికి పట్టే కాలము కూడా ఎక్కువగానే ఉంటుంది, ఒకవేళ బుద్ధి పూర్వకంగా తీసుకున్న అప్పు తిరిగి చెల్లించలేదని రుజువైన ఆ నేరానికి పడే శిక్షఅంతంత మాత్రమే.
ఈ ప్రభుత్వ రంగ బ్యాంకుల యొక్క నిరర్ధక ఆస్తుల గురించి మరింత సమాచారం మీకు అందించే ప్రయత్నం చేస్తాము


మరింత సమాచారం తెలుసుకోండి: