దేశం లో‌ ప్రస్తుతం వాహనాల కొనుగోలు మందకోడిగా సాగుతోంది.  వాహనాల అమ్మకాల నెమ్మదిగా కొనసాగితే ఆటో  పరిశ్రమ దాని 5 మిలియన్ (50 లక్షలు) లో ఐదవ వంతు ఉద్యోగులను తగ్గించుకోవలసి వస్తుంది  అని ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎసిఎంఎ) అధ్యక్షుడు రామ్ వెంకటరమణి  చెప్పారు.


భారతదేశం యొక్క ఆటో పరిశ్రమ తగ్గుదల దిశలో  ఉంది. మొదటి త్రైమాసికంలో ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 18.4 శాతం తగ్గాయి, జూన్‌లో నెలవారీ ప్రయాణీకుల వాహనాల అమ్మకాలు 18 సంవత్సరాలలో అతిపెద్ద మార్జిన్‌తో పడిపోయాయి.

ఈ తగ్గుదల వల్ల వాహన తయారీదారు  ఉద్యోగాలను తేసేసే పరిస్థితి నెలకొంది. దీని వల్ల సుమారు 10 లక్షల మంది ఉద్యోగస్తులు నిరుద్యోగులు అయ్యే అవకాశం ఉంది.

ఉత్పత్తి తగ్గడం "ఆటో కాంపోనెంట్ రంగంలో పరిస్థితి వంటి సంక్షోభానికి దారితీసింది  ఇదే ధోరణి కొనసాగితే, 1 మిలియన్ మంది ప్రజలను తొలగించవచ్చు."  అని ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎసిఎంఎ) అధ్యక్షుడు రామ్ వెంకటరమణి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: