ఇక పై రైలు ప్రయాణం చాలా ఆహ్లాదభరితంగా సాగ బోతుంది. మీరు మీ సీట్లో కూర్చోవగానే చిరునవ్వుతో రైల్వే సిబ్బంది మీకు అవసరమైన టీ,కాఫీలు, వార్తా పత్రికలు అందించబోతున్నారు. మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ ఆతిథ్య సేవలందించే ఎయిర్‌హోస్టెస్‌లు మనకు విమానం ఎక్కగానే కనిపిస్తారు.

ఇదే టైప్‌లో రైళ్లలోనూ 'ట్రైన్‌ హోస్టెస్‌'లు ఇకపై రాబోతున్నారు.

ఇప్పటికే గతిమాన్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఉన్న ఈ తరహా సేవలు త్వరలో రాజధాని, శతాబ్ది, దురంతో వంటి ప్రీమియం ప్రత్యేక రైళ్లలో ఉంటారు. వీరితోపాటు మేల్‌ స్ట్యువర్డ్‌ కూడా ప్యాసింజర్లకు ఆతిథ్య సేవలందించనున్నారు. టీ, ఆహారం, వార్తాపత్రికలు, మ్యాగజైన్లు వంటివి అందజేస్తారు.

రైళ్లలో ఆతిథ్యసేవలు, ప్రయాణికులతో మాట్లాడే విధానం వంటి వాటిపై వారికి శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ట్రైన్‌ హోస్టెస్‌లు దుస్తులపై యాప్రాన్‌లు వేసుకుని, చేతికి తొడుగులు (గ్లవ్స్‌) ధరిస్తారు. తలకు టోపీలు పెట్టుకుంటారు.

రైల్వేస్టేషన్లలో ఆహారకేంద్రాలు, ప్యాంట్రీలకు చెందిన 2,000 మంది సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు. ప్రయాణికులతో వ్యవహరించే విధానం, వస్త్రధారణపై రైల్వేశాఖ శిక్షణ ఇస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: