ఇకపై బ్యాంకు ఖాతాదారులకు రుణాలు  చాలా చౌకగా అతి తక్కువ వడ్డీ రేట్లకు లభించనున్నాయి.  గృహ రుణాలు వాహన రుణాలు మరియు వ్యక్తిగత రుణాలు ఈ యొక్క వడ్డీ రేట్లు తగ్గుతాయి గత శుక్రవారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన పరపతి విధానాన్ని సమీక్షించింది ప్రతి త్రైమాసికానికి జరిగే ఈ పరపతి విధాన సమీక్ష లో పి ఎల్ ఆర్ బి పి ఎల్ ఆర్ రేపో రేటు రివర్స్ రెపో రేట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సమీక్షించడం మామూలే.


 ఈ సారి జరిగిన పరపతి విధాన సమీక్షలో భారతీయ రిజర్వు బ్యాంకు రెపో రేటును  తగ్గిస్తున్నట్లు ప్రకటించింది ద్వారా గృహ వాహన వ్యక్తిగత రుణాల యొక్క వడ్డీ తగ్గి మధ్యతరగతి ప్రజలకు కొంత లాభం చేగూర్ అవకాశాలున్నాయి అదేవిధంగా డిపాజిట్లపై కూడా వడ్డీ రేట్లు తగ్గే అవకాశాలు ఉన్నాయి.   బ్యాంకు డిపాజిట్ల పై వచ్చే వడ్డీతో ఆధారపడి జీవించే వయోవృద్ధులు కొంతమేర నష్టపోతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే బ్యాంకుల యొక్క లాభాలు కూడా తగ్గిపోవటం ఖాయం.  
 ఈ ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పటివరకూ 40 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శ్రీ శక్తి కాంత దాస్ కూడా రుణ రేట్ల తగ్గింపు  ద్వారా సామాన్యులు సత్వరమే లాభపడే లా చర్యలు తీసుకోవాలని అన్ని బ్యాంకుల్లోనూ కోరారు. చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు భారతీయ రిజర్వు బ్యాంకు పరపతి విధాన సమీక్ష కు అనుగుణంగా తమ వడ్డీరేట్లను కూడా వెంటనే మారుస్తామని    తెలియజేసినట్లు తెలుస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: