ఎకనామినల్ గా అభివృద్ధి చెందడమంటే బంగారం, భవనాలను సమకూర్చుకోవడం కాదంట. భూమిని కాపాడుకోవడమే ఆర్థికంగా అభివృద్ధి చెందినట్టు. అప్పుడే బావి తరాలు సిరి సంపదలతో వర్థిల్లుతాయంటున్నారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ  సమస్యపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని కెఎన్ బయో సైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ డా. సుధా రెడ్డి అన్నారు. తమ సంస్థ రూపొందించిన ఆధునాతన వ్యవసాయ యంత్రపరికరాలను ఆమె మార్కెట్ లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా సుధా రెడ్డి 'ఏపీ హెరాల్డ్' ప్రతినిధితో మాట్లాడారు. ఎకనామినల్ డవలప్ మెంట్ అని చెప్పాలంటే భూమి, గాలి, నీరు అని స్పష్టం చేశారు. వీటిని భవిష్యత్తు తరాలకు వాటిని స్వేచ్ఛతో అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  అప్పుడే రానున్న తరాలు కూడా ఆర్థిక పురోభివృద్ధి చెందడానికి మార్గాలు మెరుగు పడతాయన్నారు. అయితే  ప్రస్తుత పరిస్థితుల్లో భూగర్భజలాలు అడుగంటిపోయాయని అన్నారు. వాతావరణ కాలుష్యం కూడా ప్రమాదస్థాయికి చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి మనం పీల్చేగాలి సైతం కలుషితమైపోయింది.



ఇది చాలదన్నట్టు అభివృద్ధి పేరిట  సాగు భూమి విస్తీర్ణం కూడా కుచించుకుపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. దానికి తోడు పెరిగిపోయిన కూలీల ధరలతో వ్యవసాయం భారంగా తయారైంది. దాంతో సన్న చిన్న కారు రైతులు పల్లెల నుంచి పట్టణాలకు వలసపోతున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో.. రైతు తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను సాధించేందుకు  తమ సంస్థ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందన్నారు. ఇందులో భాగంగా భూసార పరీక్షలను నిర్వహించి ఆ భూమి ఎలాంటి పంటలకు అనువుగా ఉందో అన్న అంశంపై రైతుల్లో చైతన్యం తీసుకుని వచ్చేసిందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. అంతే కాకుండా ఆయా పంటల అధిక దిగుబడులకు దోహదం చేసే పురుగులను వృద్ధి చేయడమే లక్ష్యంగా తమ సంస్థ ఉందన్నారు.


వాస్తవానికి ప్రపంచంలో 78 శాతం మేరకు పురుగులు ఉన్నాయన్నారు. అందులో కేవలం 10 శాతం మాత్రమే చెడ్డ పురుగులు ఉన్నాయని చెప్పారు. మిగిలిన పురుగులన్నీ పంటలకు మేలు చేసేవే. ఈ సూక్షాన్ని గ్రహించకుండా అధిక మోతాదులో పురుగు మందులను వినియోగించి చేజేతుల మిత్రపురుగులను నాశనానికి పూనుకుంటున్నామని వాపోయారు. ఈ క్రమంలో పురుగుల మొత్తంలో ఉన్న ప 7.8 శాతం చెడ్డ పురుగుల నాశనం కోసం విషపూరితమైన మందులను వాడుతున్నామన్నారు. ఈ పరిస్థితుల్లో మిత్ర పురుగుల వృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు.



 కెఎన్ బయో సైన్స్ సంస్థ తయారు చేసిన ట్రాక్టర్లను మార్కెట్ లోకి ప్రవేశపెట్టామన్నారు. ఈ ట్రాక్టర్లను రూ. 2.50ల నంఃచి 6 లక్షలకు అందుబాటులోకి తీసుకువచ్చామని చెప్పారు. ముఖ్యంగా యువతను వ్యవసాయ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు రాణించే దిశగా ఈ ట్రాక్టర్లను రూపొందించామన్నారు. ఇందుకు మండలాని ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్తను తీర్చిదిద్ధాలన్న లక్ష్యంతో ప్రణాళికలను సిద్ధం చేశామన్నారు. తమ ట్రాక్టర్ల సాయంతో మూడు రోజుల పొటు చేసే పొలం పనులను కేవలం గంట వ్యవధిలో చేయవచ్చని సుధారెడ్డి చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: