దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది వినియోగదారులకు పెద్ద ఉపశమనం కలిగించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక కొత్త ఆదేశాలు జారీ‌చేసింది. విఫలమైన లావాదేవీల కోసం ఆటోమేటెడ్ టెల్లర్ మెషీన్ల (ఎటిఎం) వినియోగదారులను వసూలు చేయవద్దని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బిఐ) బ్యాంకులను ఆదేశించింది. 


సెంట్రల్ బ్యాంక్ బుధవారం సాయంత్రం విడుదల చేసిన సర్క్యులర్‌లో  "సాంకేతిక కారణాల వల్ల విఫలమైన లావాదేవీలు, ఎటిఎంలలో కరెన్సీ లభించకపోవడం వంటివి ఉచిత ఎటిఎం లావాదేవీలు వాటికి వినియోగదారుని దగ్గర వసూలు చేయబోమని" తెలిపింది. 

"హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, కమ్యూనికేషన్ సమస్యలు, ఎటిఎమ్‌లో కరెన్సీ నోట్ల లభ్యత లేకపోవడం మరియు బ్యాంకు కస్టమర్  కి పూర్తిగా ఆపాదించదగిన ఇతర సర్వీసులు,  చెల్లని పిన్  వంటి ధ్రువీకరణలు,  సాంకేతిక కారణాల వల్ల  విఫలమయిన లావాదేవీలు, మొదలగునవి కస్టమర్ దగ్గర వసూలు అయ్యే ఎటిఎం లావాదేవీలుగా లెక్కించబడవు. అందువల్ల, వాటి కోసం ఎటువంటి ఛార్జీలు విధించబడవు "అని సెంట్రల్ బ్యాంక్ తెలిపింది.

 నగదు రహిత లావాదేవీలైన బ్యాలెన్స్ ఎంక్వైరీ, చెక్ బుక్ రిక్వెస్ట్, టాక్స్ పేమెంట్, ఫండ్స్ ట్రాన్స్ఫర్, మొదలగు లావాదేవీలు కూడా  ఇందులో‌కి  వస్తాయని బ్యాంక్ తెలిపింది. కార్డు జారీ చేసిన బ్యాంక్  ఎటిఎమ్ వద్ద కార్డు ఉపయోగించినప్పుడు, ఉచిత ఎటిఎం లావాదేవీల సంఖ్యలో అవి లెక్కించ కూడదు అంటే మన బ్యాంక్ లో‌ డబ్బులు తీసుకుంటే అవి ఉచిత లావాదేవీల కొందకి వస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: