అంతర్జాతీయంగా ట్రెండ్ సానుకూలముగా ఉండటం, దేశీ జువెలర్ల నుంచి డిమాండ్ రోజు రోజుకీ పెరిగిపోతుంది. భారత దేశంలో సాంప్రదాయ పద్దతులు ఎక్కువగా పాటిస్తుంటారు.  ముఖ్యంగా బంగారు వాడకం ఎక్కువగా ఉండటంతో ఇక్కడ గోల్డ్ రేటు ఎంత పెరిగినా డిమాండ్ మాత్రం అస్సలు తగ్గదు.  గడిచిన కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టాయి.

దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో ఢిల్లీలో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల ధర రూ.425 తగ్గి రూ.37,945 వద్దకు చేరుకున్నది.   అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం పరుగులు పెడుతూనే ఉంది. పసిడి ధర ఔన్స్‌కు 0.77 శాతం పెరుగుదలతో 1,528.85 డాలర్లకు చేరింది. అలాగే వెండి ధర ఔన్స్‌కు 1.62 శాతం పెరుగుదలతో 17.34 డాలర్లకు ఎగసింది.  పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడం ధరపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

హైదరాబాద్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.37,830కు చేరింది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.36,030కు పెరిగింది. కేజీ వెండి ధర రూ.47,600 వద్దకు ఎగసింది.  తాజాగా ఇప్పుడు పసిడి కిందకు దిగి వస్తుంది.  ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. రికార్డు స్థాయిలో పెరిగిన వెండి ఆ మరుసటి రోజే భారీగా తగ్గింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారులు కొనుగోళ్లకు మొగ్గుచూపకపోవడంతో కిలో వెండి ధర రూ.690 తగ్గి రూ.44,310 వద్ద ముగిసింది. 


మరింత సమాచారం తెలుసుకోండి: