హైదరాబాద్ ఈఎస్ఐ స్కామ్‌పైన విచారణను వేగవంతం చేసింది ఏసీబీ. ఈఎస్ఐ మందుల కొనుగోలుపై తీవ్రంగా దర్యాప్తు చేస్తోంది. సచివాలయం సిబ్బంది నుంచి డైరెక్టర్ కార్యాలయం వరకు అధికారుల హాస్తాలను వెలికి తీస్తుంది ఏసీబీ. మందుల కొనుగోలులో కచ్చితంగా అక్రమాలున్నాయంటూ.. సంచలన విషయాలను వెలుగులోకి తెస్తుంది అవినీతి నిరోదక శాఖ. 

ఈఎస్ఐ మందుల కొనుగోలులో భారీ అక్రమాలు జరిగినట్టుగా విజిలెన్స్ చేసిన విచారణలో తేలింది. రాష్ట్రంలో ఉన్న డిస్పెన్సరీ నుంచి ఆసుపత్రిల వరకు ఈ స్కామ్ జరిగినట్టుగా తేల్చారు అధికారులు. అవసరం లేకపోయినా.. మందులు కొనుగోలు చేసి అక్రమాలకు పాల్పడినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఎక్కడా పనికి రాని మందులను కూడా కొనుగోలు చేసింది మెడికల్ శాఖ. ఇలా బయటపడిన నిజాల నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది విజిలెన్స్ డిపార్ట్ మెంట్. దీంతో.. సీరియస్‌గా తీసుకున్న ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది.

ప్రభుత్వ ఉత్తర్వులతో విచారణ ప్రారంభించిన అవినీతి నిరోధక శాఖ గత నెల రోజుల నుంచి విచారణను వేగంగా చేస్తోంది. ముషీరాబాద్‌లో ఉన్న డైరెక్టర్ కార్యాలయంలోని  అధికారులను విచారించింది. స్కామ్ అక్కడ నుంచే మొదలైందని భావించిన ఏసీబీ డైరెక్టర్ కార్యాలయంలో విసృత్తంగా సొదాలు చేస్తోంది. ఈఎస్ఐ మెడికల్ స్కామ్ తవ్విన కొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఈ స్కామ్‌లో పై నుంచి కింది స్థాయి ఆధికారుల పాత్ర వుందని తేల్చింది ఏసీబీ. డైరెక్టరెట్ కార్యాలయం నుంచి  సచివాలయంలోని అధికారుల వరకు ఇందులో పాత్ర వుందని అనుమానం వ్యక్తం చేస్తోంది ఏసీబీ. అసలు ఫార్మా కంపెనీలు లేకుండానే మందులను కొనుగొలు చేశారు. షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి వాటి దగ్గర నుంచి మందులను కొనుగొలు చేశారని బయట పెట్టింది ఏసీబీ. అంతేకాక అవసరం లేని మందులను కూడా పెద్ద మొత్తంలో కొన్నట్టుగా తేల్చింది. ఇలా కొనుగొలు చేసిన మందులన్నీ మూలన పడేశారని తెలుస్తోంది. మొత్తం మీద... గత నెల రోజుల నుంచి జరుగుతున్న విచారణలో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. చాలా ఫేక్ కంపెనీలతో పాటు అధికారులు పాత్రపైన ఆధారాలు సేకరించింది ఏసీబీ. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 






మరింత సమాచారం తెలుసుకోండి: