భారత్ లో కార్యకలాపాలకు బికినీ ఎయిర్‌లైన్స్ సర్వం సిద్ధం చేసుకుంది.వీటిసేవలు ఎప్పటి నుంచి ప్రారంభిస్తున్నది ప్రకటించింది..ఇది చదివినవారు పేరేదో కొత్తగుంది బికిని ఎయిర్‌లైన్స్ అంటే బినికిలతో కనిపిస్తారనుకుంటున్నారా?లేక 9రూపాయలకు హైదరాబాద్‌లో చాయ్ కూడ రావట్లేదు ఇంకా విమానం టికిట్ ఎలావస్తుందని ఆలోచిస్తున్నారా?మీరాలోచించేది నిజమో కాదో తెలుసుకోవాలంటే విషయం మొత్తం చదవండి అర్దం అవుతుంది.ఇంతకు అసలు సంగతేంటంటే,వియత్ జెట్ అనే విమానయాన కంపెనీ ఒకటుంది.ఇది వియత్నాం కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది.ప్రయాణికులు ఈ కంపెనీని బికినీ ఎయిర్‌లైన్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు.దీనికి కారణం కంపెనీ అనుసరించే వినూత్నమైన ప్రమోషనల్ యాక్టివిటీస్ కారణం..




ఇక ఈ కంపెనీ ఎప్పటినుంచో భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించాలని చూస్తోందట.ఇన్నాళ్లకు వారి సేవల సమయం ఆసన్నమై ఈ ఏడాది డిసెంబర్‌ 6 నుంచి ఈ ఎయిర్‌లైన్స్ సేవలు ప్రారంభిస్తామని తాజాగా ప్రకటించింది.కాగా తొలి ఫ్లైట్ ఢిల్లీ నుంచి వియత్నాం ప్రయాణించనుంది. ప్రయాణ సమయం 5 గంటలు పట్టొచ్చునని ప్రారంభం నుండి ప్రతి రోజూ విమానాలు నడుపుతామని కంపెనీ తెలిపింది.ఇక ఈ కంపెనీ  కార్యకలాపాల ప్రారంభం సందర్భంగా ప్రయాణికులకు అదిరిపోయే ఆఫర్లు కేవలం మూడురోజులపాటు మాత్రమే ప్రకటించింది.




ఈ ఆఫర్స్ వర్తించే తేది ఆగస్ట్ 20 నుంచి 22 వరకు అందుబాటులో ఉండనున్న ఈ సేల్‌లో భాగంగా కేవలం రూ.9 ప్రారంభ ధరతో టికెట్లు పొందొచ్చని కంపెనీ తెలిపింది.ఇది కేవలం బేస్ ఫేర్ మాత్రమేనట.అంటే ఇతర పన్నులు అన్నీ కలుపుకుని టికెట్ కొనుగోలు చేయాలంటే ప్రారంభ ధర రూ.8,863గా ఉంటుందట.ఇక వియత్ ఎయిర్‌లైన్స్ కు బికినీ ఎయిర్‌లైన్స్ అని పేరు రావడాని కి కారణం ఈ సంస్ద ప్రతి ఏడాది క్యాలెండటర్‌ను విడుదల చేస్తుందట.ఇందులో బికినీ భామలే ఎక్కువగా వుండి కంపెనీ ఇతర ప్రమోషనల్ యాక్టివిటీస్‌లో ఎక్కువగా కనిపిస్తుంటారు కాబట్టి అందువల్ల ఈ ఎయిర్‌లైన్స్‌కు బికినీ ఎయిర్‌లైన్స్ అనే పేరుందని సంస్ద ప్రతినిధి తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: