బండి కొందామంటే ఇప్పుడు చాలా మందికి ఓ చిక్కు వచ్చిపడింది. అదేంటంటే.. కేంద్రం భారత్‌ స్టేజ్‌-VI... అదే బీఎస్ 4.. ప్రమాణాలు కలిగిన వాహనాలను 2020 ఏప్రిల్‌ 1 నుంచి తప్పనిసరి చేసింది. అయితే ఇప్పటికీ ఇంకా బీఎస్ 4 వాహనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.


కేంద్రం తప్పనిసరి నిబంధనలో వీటిని కొనేందుకు జనం వెనుకడుగు వేస్తున్నారు. అలాగని బీఎస్ 6 కొందామంటే రేటు ఎక్కువ. ఈ నేపథ్యంలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. బీఎస్‌ 4 వాహనాల కొనుగోలు విషయంలో నెలకొన్న గందరగోళానికి ఫుల్ స్టాప్ పెట్టింది.


బీఎస్ 4 వాహనాలను 2020 మార్చి వరకు కొనుగోలు చేయొచ్చట. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్వయంగా దీనిపై క్లారిటీ ఇచ్చారు. దీంతో కేంద్రం నిర్ణయం కొత్తగా బండి కొనాలనుకుంటున్నవారికి హ్యాపీ న్యూస్ అయ్యింది.


అటు ఆటో కంపెనీలు కూడా నిర్మలా రామన్ ప్రకటనపై హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికే మాద్యం కోరల్లోకి జారుకుంటున్న ఆటో రంగానికి ఈ నిర్ణయం కాస్త ఊరట ఇస్తుంది. కార్లు, మోటార్‌ సైకిళ్లు, స్కూటర్ల అమ్మకాలు చాలా వరకు పడిపోయిన నేపథ్యంలో ఈ క్లారిటీ కాస్త జోరు పెంచే అవకాశం కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: