హైద‌రాబాద్ చర్లపల్లి ఇండస్ట్రియల్ ఏరియాలో భారీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. ఆర్గానిక్  ఫెర్టిలైజర్  కెమికల్  కంపెనీలో తెల్లవారుజామున  మంటలు  అంటుకున్నాయి. దీంతో  కార్మికులు  బయటకు  పరుగులు  తీశారు. దట్టమైన పొగతో  మంటలు ఎగిసిపడుతుండటంతో చుట్టుపక్కల  ప్రజలు  భయాందోళన  చెందుతున్నారు.  ఘటనాస్థలికి చేరుకున్న ఐదు అగ్నిమాపక యంత్రాలతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 


కెమికల్ కంపెనీలో భారీ అగ్నిప్రమాదం  నేప‌థ్యంలో లక్షల రూపాయలకు  పైగా ఆస్తి నష్టం  జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు  5 గంటలకు పైగా  మంటలు ఎగిసిపడుతున్నట్టు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న  అగ్నిమాపక సిబ్బంది  సంఘటనా స్థలానికి  చేరుకొని మంటలను అదుపు చేస్తున్నాయి. దీంతో పాటు 25 ట్యాంకర్లను  తెప్పించి  మంటలను ఆర్పేందుకు  ప్రయత్నిస్తున్నారు.  అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియల్సి ఉంది. కాగా, చర్లపల్లి పారిశ్రామికవాడలో తరుచూ ప్రమాదాలు జరుగుతుండడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. 
ఇలాంటి  ప్ర‌మాదాలు జ‌ర‌గ‌కుండా త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని అధికారుల‌ను, కంపెనీల య‌జ‌మానుల‌ను స్థానికులు కోరుతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: