బ్యాంకుల విలీనం  విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ..దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగులు భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమం నిర్వహించతలపెట్టారు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి  నిర్మలా సీతారామన్ బ్యాంకుల విలీనం పై కీలక నిర్ణయాలు తేసరుకున్నారు.ఇప్పటివరకు ఇండియాలో  27 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఉన్నాయని,ఇవాళ చేసిన ప్రకటనతో ఇకపై దేశంలో 12 పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు మాత్రమే ఉంటాయని ఆమె తెలిపారు. మొత్తం 10 ప్రభుత్వ బ్యాంకులను కేవలం నాలుగు బ్యాంకులుగా ఏర్పాటు విలీనం చేస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు.





ఈ నిర్ణయాలను  వ్యతిరేకిస్తూ శనివారం  తమ పోరాటం కొనసాగుతుందని ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్(ఏఐబిఈఏ)జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం వెల్లడించారు. మెగా బ్యాంకులు,మెగా విలీనాలు అవసరం లేదని  ఆయన అన్నారు. మనది విస్తారమైన దేశం అని,లక్షలాది మంది గ్రామ ప్రజలకు ఇప్పటికీ బ్యాంకు సౌకర్యం కలగలేదని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసారు. ఇదిలా ఉండగా..కేంద్రం మాత్రం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పిఎన్ బి),ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ లు విలీనం అవబోతున్నాయని, 17.95 లక్షల కోట్ల బిజినెస్ తో రెండవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా అవతరించేందుకు కార్యాచరణ రుపొందుంచింది.





జాతీయ స్థాయి కలిగిన...9.3లక్షల కోట్ల వ్యాపారంతో బ్యాంక్ ఆఫ్ ఇండియా, 4.68లక్షల కోట్ల వ్యాపారంతో సెంట్రల్ బ్యాంకు కంటిన్యూ అవ్వాలని సూచింది. సిండికేట్ బ్యాంకు,కెనరా బ్యాంక్  విలీనం ద్వారా 15.20లక్షల కోట్ల బిజినెస్ తో  నాల్గవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంకుగా అవతరించబోతున్నట్లు కేంద్ర  మంత్రి  తెలిపారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆంధ్రాబ్యాంక్, కార్పొరేషన్ బ్యాంకులు ఇకపై ఒకే బ్యాంకుగా అయ్యి  ఐదవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ గా ఇప్పుడు అవతరించినట్లు ఆమె తెలిపారు.అలహాబాద్ బ్యాంకు ఇండియన్ బ్యాంక్ విలీనం ద్వారా 8.08లక్షల కోట్లతో ఏడవ అతిపెద్ద పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ గా ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. .


మరింత సమాచారం తెలుసుకోండి: