భారత ఆర్థిక వ్యవస్థ కుదేలు కానుందా.. దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారవుతోంది. వృద్ధిరేటు పతనం ఎటు దారి తీస్తుంది.. ఇన్నాళ్లూ మోడీ సర్కారు చెప్పినవన్నీ కబుర్లేనా.. అన్న భయాందోళనలు కలుగుతున్నాయి. తాజాగా విడుదలైన గణాంకాలు అదే చెబుతున్నాయి మరి.


2019-20 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టస్థాయికి పడిపోయింది. జులైలో దేశంలోని 8కీలక రంగాల్లో ప్రగతి పడకేసింది. ఏప్రిల్ -జూన్ త్రైమాసికంలో జీడీపీ వృద్ధి 5శాతానికే పరిమితమైపోయింది. ఒకటి, కాదు.. రెండు కాదు.. దాదాపు 8 కీలక రంగాల్లో వృద్ధి రేటు కేవలం 2.1 శాతానికి పరిమితమైంది.


ఇది ఎంత దారుణమంటే.. గత ఏడాది ఇదే సమయానికి ఇవే ఎనిమిది కీలక రంగాల్లో వృద్ధి రేటు 7.3గా ఉంది. అంటే.. ఎంత దారుణంగా పడిపోయిందో చూడండి. ప్రధానంగా బొగ్గు, ముడి చమురు, సహజ వాయువు ఉత్పత్తుల్లో తగ్గుదల కారణంగానే ఈ దుస్థితి దాపురించిందని ఎనలిస్టులు చెబుతున్నారు.


బొగ్గు, గ్యాస్, ఆయిల్, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, ఉక్కు, సిమెంట్, విద్యుత్ రంగాలు మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీలో 40.27 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ పతనం దేశాన్ని మాంద్యం వైపు తీసుకెళ్తుందేమో అన్న ఆందోళన వ్యాపార వర్గాల్లో నెలకొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: