Indiaherald Group of Publishers P LIMITED

X
close save
crop image
x
Sat, Oct 19, 2019 | Last Updated 1:19 am IST

Menu &Sections

Search

'జియో' కు పోటీగా 'బిఎస్ఎన్ఎల్' సంచలన ఆఫర్....!!

'జియో' కు పోటీగా 'బిఎస్ఎన్ఎల్' సంచలన ఆఫర్....!!
'జియో' కు పోటీగా 'బిఎస్ఎన్ఎల్' సంచలన ఆఫర్....!!
http://apherald-nkywabj.stackpathdns.com/images/appleiconAPH72x72.png apherald.com
ఇటీవల మూడేళ్ళ క్రితం టెలికాం రంగంలో జియో రంగప్రవేశంతో మొబైల్ వాయిస్ కాల్స్ మరియు ఇంటర్నెట్ టారిఫ్ ధరలు చాలావరకు తగ్గి, సామాన్యుడికి సైతం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే జియో ప్రవేశపెట్టిన ఆఫర్లతో మిగతా టెలికాం నెట్వర్క్ లు కూడా ధరలు తగ్గించి దిగిరాక తప్పలేదు. ఇక త్వరలో డిటిహెచ్, వాయిస్ కాల్స్, ఇంటర్నెట్ మూడూ కలిపి అతి తక్కువ ధరకు ఇచ్చేలా ఇప్పటికే జియో గిగా ఫైబర్ పేరుతో జియో అధికారికంగా ప్రకటించడం జరిగింది. మరొక రెండు రోజుల్లో దేశంలోని ప్రధాన ప్రాంతాల్లో పూర్తిగా అందుబాటులోకి రానున్న ఈ సేవలు, ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పైలెట్ ప్రాజక్టు కింద ఇవ్వడం జరిగింది. రూ.700 నుండి రూ.10,000 వరకు తమ టారిఫ్ ప్లాన్లు ఉంటాయని, 

అలానే ఇంటర్నెట్ స్పీడ్ 100 ఎంబీపీఎస్ నుండి 1 జిబిపీఎస్ వరకు ఉంటుందని తమ కంపెనీ యాన్యువల్ జనరల్ మీటింగ్ లో తెలిపిన జియో సంస్థ అధినేత ముఖేష్ అంబానీ, సెప్టెంబర్ 5 న పూర్తి ప్లాన్ ల వివరాలతో తమ సంస్థ కార్యకలాపాలను మొదలుపెట్టడం జరుగుతుందని అన్నారు. అయితే జియో చేసిన ఆ సంచలన ప్రకటన తరువాత డిటిహెచ్, ఇంటర్నెట్ ఆపరేటర్లు అంతర్మథనంలో పడ్డారు. అంతేకాక కొన్ని ఇంటర్నెట్ సంస్థలు ఆ తరువాత తమ టారిఫ్ ప్లాన్ల స్పీడ్ మరియు ధరల్లో మార్పులు చేసి వినియోగదారుల్ని ఆకర్షించే ప్రయత్నాలు మొదలెట్టాయి. అయితే ఈ విషయమై ప్రభుత్వ రంగ సంస్థైన బిఎస్ఎన్ఎల్ ఒకింత దూకుడుగా ముందుకు సాగుతున్నట్లు సమాచారం. దీనిపై నిన్నటి నుండి పలువురు టెక్ నిపుణులు చెప్తున్న వివరాల ప్రకారం, 

ఇప్పటికే బిఎస్ఎన్ఎల్ సంస్థ, జియో వలె వినియోగదారులకు కేబుల్, ఇంటర్నెట్, వాయిస్ కాల్స్ వంటి మూడు సర్వీసులు కూడా రూ.700 రేంజ్ లో అందించేలా ఇప్పటికే గట్టిగా ప్రణాళికలు చేపట్టిందట. అంతేకాక అందులోని ఉద్యోగులు దీనిపై పలు ప్రాంతాల్లో పరిశీలన మొదలెట్టారని, అయితే జియో మాదిరిగా ఇంటర్నెట్, ఫ్రీ కాల్స్ తో పాటు ఎక్కడికక్కడ లోకల్ కేబుల్ ఆపరేటర్లతో బిఎస్ఎన్ఎల్ ఒప్పందం కుదుర్చుకుని వినియోగదారులకు ఛానల్స్ అందించే ఏర్పాటు చేయనుందని అంటున్నారు. అయితే ఇప్పటికే కొన్ని ప్రాంతాలను పైలెట్ ప్రాజక్ట్ కింద టెస్ట్ సర్వీస్ అందించేందుకు సిద్ధం చేసిందట. అందులో ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుండి ఈ సేవలు మొదలవుతాయని అంటున్నారు. 

ఈ మేరకు అక్కడి కేబుల్ ఆపరేటర్లతో కూడా ఆ సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపి వారిని ఒప్పించినట్లు సమాచారం. అలానే జియో మాదిరిగా బిఎస్ఎన్ఎల్ కూడా మూడు రకాల సేవలను అందించేందుకు వీలుగా ఒకే రూటర్ ని కూడా సిద్ధం చేయబోతున్నట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అందుతున్న ఈ సమాచారం పై అతి త్వరలో బిఎస్ఎన్ఎల్ ప్రతినిధుల నుండి అధికారిక ప్రకటన కూడా వెలువడనుందట. మరి ఇది కనుక నిజమే అయితే, ఒకరకంగా ఈ సర్వీస్ తో బిఎస్ఎన్ఎల్ చాలావరకు జియోకు షాక్ నివ్వడం ఖాయమని అంటున్నారు టెక్ నిపుణులు....!!  


bsnl
5/ 5 - (1 votes)
Add To Favourite
More from author
'ఆర్ఆర్ఆర్' అప్ డేట్ : మరొక మూడురోజుల్లో టైటిల్ ప్రకటన...??
'జాన్' మూవీ స్టోరీ లైన్ రివీల్ చేసిన పూజా హెగ్డే...!!
అమితాబ్ ఆరోగ్యంపై షాకింగ్ నిజాలు.. క్లారిటీ ఇచ్చిన ఆసుపత్రి వైద్యులు....!!
ఎక్స్ క్లూజివ్ న్యూస్ : మెగాస్టార్ బయోపిక్ లో హీరో అతనే...??
బ్రేకింగ్ : మరోసారి రిపీట్ కానున్న క్రేజీ కాంబినేషన్.....!!
మెగాస్టార్ 152 మూవీ టైటిల్ పై షాకింగ్ స్టేట్మెంట్.....!!
మహేష్, బన్నీ ల సినిమాలకు కీలకంగా మారనుంది వారేనా....??
'సరిలేరు నీకెవ్వరు' లో విజయశాంతి పాత్ర ఎలా ఉంటుందో చెప్పిన పరుచూరి....!!
సుధీర్ - రష్మీ పెళ్లి పై సంచలన నిజం బయటపెట్టిన గెటప్ శ్రీను.....!!
ఆయనే కావాలంటున్న కాజల్.....!!
ఒకే రోజు బాక్సాఫీస్ బరిలో నిలుస్తున్న విజయ్, కార్తీ....!!
ప్రస్తుతం టాలీవుడ్ లో ఆ ఇద్దరు హీరోయిన్లే టాప్....!!
బ్రేకింగ్ : విడాకులకు సిద్దమైన మంచు మనోజ్......!!
గర్భవతిగా కీర్తి సురేష్.....వైరల్ అవుతున్న పిక్......!!
షావోమీ రెడ్మీ ఫోన్స్ యూజర్స్ కు సెన్సేషనల్ న్యూస్....!!
మెగా మూవీలో నటించే ఛాన్స్ పట్టేసిందా....??
'బాహుబలి 2' ని కూడా ఈజీగా బీట్ చేసిందిగా....!!
అభిమాని సినిమాపై మహేష్ బాబు మెమొరబుల్ వర్డ్స్....!!
శృంగారంతో ఆయుష్షుకు ఉన్న సంబంధం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
'సైరా' మూవీ పై ఉప రాష్ట్రపతి వెంకయ్య సంచలన కామెంట్స్....!!
బాబోయ్, బిగ్ బాస్ 3 విన్నర్ పై షాకింగ్ లీకులు....!!
ట్రైలర్ టాక్ : 'మీకు మాత్రమే చెప్తా' : ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్....!!
తెలంగాణ ఆర్టీసీ కొత్త ఎండీ ఎవరంటే....??
'సైరా' పని అయిపాయెరా....!!
హరీష్ మౌనానికి కారణం ఏమిటి,,,,,,ఆర్టీసీ కార్మికులకు మోక్షం లేదా....??
పూరి కొడుకు కోసం రంగంలోకి శివగామి....!!
చిక్కుల్లో నయనతార భవితవ్యం....!!
తన అభిమాని నిర్మించిన సినిమా ట్రైలర్ లాంఛ్ చేయబోతున్న మహేష్ బాబు....!!
'గద్దలకొండ గణేష్' వరుణ్ కు చెడు కూడా చేసింది....!!
'సాహో' కు చేసిన తప్పే 'జాన్' విషయంలోనూ చేస్తున్న ప్రభాస్ ....??
షాకింగ్ గా బాలకృష్ణ 105 టైటిల్ రివీల్ చేసారు....!!
హాలీవుడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్న రౌడీ హీరో.....!!
అదరగొట్టిన సాయి ధరమ్ తేజ్ 'ప్రతిరోజు పండగే' ఫస్ట్ గ్లిమ్ప్స్ వీడియో ప్రోమో....!!
బన్నీ, మహేష్ ల మధ్య నలిగిపోతున్నారుగా....!!
కింగ్ ఖాన్ ని దర్శకత్వం వహించనున్న సౌత్ దర్శకుడు....!!
ఎన్టీఆర్ ని వెనక్కు నెట్టిన మహేష్ బాబు....!!
About the author

Bharath has been the knowledge focal point for the world, As Darvin evolution formula End is the Start ... Bharath again will be the Knowledge Focal Point to the whole world. Want to hold the lamp and shine light on the path of greatness for our country Bharath.