యూట్యూబ్ లో వేల కొద్ది చానెళ్లు, లక్షలకొద్ది కార్యక్రమాలు పుట్టుకొస్తున్నాయి . యూట్యూబ్ లో ఎవరికీ తోచినరీతి లో వారు చానెళ్లను ఏర్పాటు చేస్తుండగా , తమకు తోచినట్లుగా ఔత్సాహికులు   కార్యక్రమాలను అప్ లోడ్ చేస్తున్నారు .  ఈ చానెళ్లు, కార్యక్రమ నిర్వాహకులు  తమ వ్యూవర్స్ ను పెంచుకోవడానికి తమ పైత్యాన్ని అంతా యూట్యూబ్ ప్రేక్షకులపై రుద్దే ప్రయత్నాన్ని చేస్తుండడం తో , యూట్యూబ్ యాజమాన్యం  ఇకపై ఛానెళ్లపై , కార్యక్రమ నిర్వాహకులపై  ఆంక్షలు మరింత కఠినతరం చేసింది .

ప్రతిరోజూ  లక్షల కొద్దీ వీడియోలు యూట్యూబ్ అప్‌లోడ్ అవుతున్న తరుణంలో ఎప్పటికప్పుడూ యూట్యూబ్ యాజమాన్యం తమ  నిర్ణయాలను సమీక్షించుకుని కొత్త నిర్ణయాలను  తీసుకుంటోంది. ఇప్పటికే ప్రతి మూడు నెలలకోసారి చానెళ్లను , కార్యక్రమాలను  సమీక్షిస్తోన్న  యూట్యూబ్ యాజమాన్యం ...  పనికిమాలిన వీడియోలను డిలేట్ చేస్తున్నారు. ఇక ఇప్పుడు పెద్ద సంఖ్యలో యూట్యూబ్ ఛానళ్లను కూడా  తొలగించాలని నిర్ణయించింది . మరో వైపు చూస్తే యూట్యూబ్‌లో మంచి కన్నా చెడు ఎక్కువ కనిపిస్తోందనే విమర్శలు  లేకపోలేదు. ఈ క్రమంలో  యూట్యూబ్ యాజమాన్యం  చెత్త వీడియోలను  తొలగించడం ద్వారా తమపై వస్తున్న   విమర్శలను తప్పించుకునే పని లో ఉన్నారు .

ఈ ఏడాదిలో జూన్ నుంచి సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించి ఇప్పటికే దాదాపు లక్ష వరకు వీడియోలను తొలగించినట్లు యూట్యూబ్ యాజమాన్యం ఒక  ప్రకటన విడుదల చేసింది . లక్ష వీడియోలను తొలగించడమే కాకుండా,  40 లక్షలకు పైగా యూట్యూబ్ అకౌంట్లను తొలగించామని వెల్లడించింది . వీటిలో ఎక్కువ మేరకు చానెళ్లు , కార్యక్రమాల పేరిట వీడియోలను అప్ లోడ్ చేస్తున్న అకౌంట్లే అధికమని తెలుస్తోంది . గతం లో ఇష్టారీతిలో యూట్యూబ్ లో వీడియో లో అప్ లోడ్ చేసినట్లుగా ...ఇకపై చేస్తామంటే చెల్లదని యాజమాన్యం అకౌంట్ల తొలగింపు ద్వారా చెప్పకనే చెప్పింది . 


మరింత సమాచారం తెలుసుకోండి: